2024 ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీ పార్టీ , నేతల నియామకంలో ఈ సారి ఆచితూచి అడుగులేస్తోంది అనే చెప్పొచ్చు. ముఖ్యంగా పార్టీకి సంభందించి జగన్ మాటలు కొంత ధైర్యాన్ని కార్యకర్తలకి ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్‌గా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించారు. అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
![]() |
![]() |