ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పుడు 43మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2019లో 46మంది ఎన్నికల బరిలో నిలిచారు. అప్పట్లో పీడీఎఫ్ అభ్యర్థి ఇళ్ల వెంకటేశ్వరరావు, ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డిల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇళ్ల వెంకటేశ్వ రరావుకు 98,193 ఓట్లురాగా అప్పట్లో ఎమ్మె ల్సీగా గెలుపొందారు. ప్రధాన ప్రత్యర్థి నల్ల మిల్లి శేషారెడ్డికి కేవలం 38,124 ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. ఇదిలా ఉండగా ఈసారి 43 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కూటమి ప్రభుత్వం తర పున పేరాబత్తుల రాజశేఖరం బరిలో నిలి చారు. పీడీఎఫ్ తరపున దిడ్ల వీరరాఘవులు ఎన్నికల బరిలో ఉన్నారు. వైసీపీ ఎన్నికలకు దూరంగా ఉంది. తెలుగు నవగర్జన పార్టీ నుంచి కాట్రు నాగబాబు, రిఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి షేక్ హుస్సేన బరిలో ఉన్నారు. మిగిలిన అభ్యర్థులు స్వతంత్ర అభ్య ర్థులుగా ఎన్నికల్లో ఉన్నారు.
![]() |
![]() |