భరతముని జయంతిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం అనంతపురం కమలానగర్‌లోని శ్రీనృత్య కళానిలయం ప్రాంగణంలో నిర్వహించిన నృత్యనీరాజన ప్రదర్శన వీక్షకులను ఎంతగానో అలరించింది. తొలుత భరతముని చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం నిర్వహించిన నృత్యప్రదర్శనల్లో శాస్త్రీయ సంగీతానికి సంప్రదాయ నృత్యాలతో కళాకారులు అలరించారు. ప్రదర్శనానంతరం కళాకారులకు సంస్కార భారతి సంస్థ ఆద్వర్యంలో ప్రశం సాపత్రాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో శ్రీనృత్యకళా నిలయం నాట్యాచార్యురాలు సంధ్యామూర్తి, ఎస్కేయూ విశ్రాంత రిజిస్ర్టార్ ఆచార్య సుధాకర్‌బాబు, సంస్కార భారతి ప్రతినిధి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |