వైసీపీలో పలు కీలక నియామకాలకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి స్థానాన్ని కురసాల కన్నబాబును నియమించారు. ఇప్పటి నుంచి కన్నబాబు ఉత్తరాంధ్ర జిల్లా రీజినల్ కో– ఆర్డినేటర్‌గా వ్యవహరించనున్నారు. అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజాను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తాజాగా వెల్లడించింది.ఈ క్రమంలో వరుస సమావేశాలను నిర్వహిస్తోన్నారు జగన్. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, ఇతర స్ధానిక సంస్దల ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు.ఈ క్రమంలో కొత్త నియామకాలతోనూ దూసుకెళ్తోన్నారు వైఎస్ జగన్. కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులకు పార్టీలో కీలక పదవులను ఇచ్చారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలను అప్పగించారు. గతంలో విజయసాయి రెడ్డి ఈ స్థానంలో పని చేసిన విషయం తెలిసిందే.
![]() |
![]() |