విద్యార్థులకు ఈ నెల 14న చేపట్టనున్న కంటి అద్దాలు పంపిణీ చేసే రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అధికారుల ను ఆదేశించారు. ఆయన బుధవారం గార్లదిన్నె స్థానిక ఆదర్శ పాఠశాలను అసిస్టెంట్ కలెక్టర్ వినూత్నతో కలసి సందర్శిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ నెల 14న ఆదర్శ పాఠశాలలో నిర్వ హిం చనున్న విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొంటున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించా రు. అనంతరం వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంతమంది విద్యార్థులకు కంటి లో పాలున్నాయి? ఎంతమందిని గుర్తిం చారు? తదితర అంశాలపై చర్చిం చారు. ఈ కార్యక్రమంలో డీఎం హెచఓ డాక్టర్ ఈబీదేవి, డీఈఓ ప్రసాద్‌బాబు, తహసీల్దార్ బండారు ఈరమ్మ, ఎంపీడీఓ యోగానందరెడ్డి, ఏఓ బాబాపకృద్దీన, ఎంఈఓ తారా చంద్రానాయక్, పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
![]() |
![]() |