సెంథిల్ బాలాజీ మంత్రిగా కొనసాగాలా అనే విషయమై అఫిడివిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చట్టవ్యతిరేకంగా నగదు బట్వాడా కేసులో ఈడీ అరెస్ట్ చేసిన సెంథిల్ బాలాజి, 417 రోజుల అనంతరం బెయిలుపై విడుదలయ్యారు. విడుదలై మరుసటిరోజే ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా సెంథిల్ బాలాజి బాధ్యతలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ చెన్నైకి చెందిన విద్యాకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.మంత్రి పదవిలో లేననే కారణంతో బెయిలు పొందిన ఆయన, మరుసటిరోజే మంత్రిగా బాధ్యతలు చేపట్టారని, దిగువ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న నేఫథ్యంలో, విచారణకు అడ్డంకులు సృష్టించే అవకాశముందని, అందువల్ల ఆయన బెయిలు రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ గతంలో విచారించిన న్యాయమూర్తులు, సెంథిల్ బాలాజీకి వ్యతిరేకంగా ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో, ఈ పిటిషన్ బుధవారం మళ్లీ విచారణకు రాగా... సెంథిల్ బాలాజీకి బెయిలు రాక ముందు ఈ కేసులో విచారణ జరిపిన ఫోరెన్సిక్ నిపుణుడు ఇప్పుడు గైర్హాజరయ్యారని, ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉండడంతో నిపుణుడు భయంతో విచారణకు హాజరుకాలేదని, అందువల్ల సెంథిల్ బాలాజీ బెయిలు రద్దు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ విభాగం న్యాయవాది వాదించారు.సెంథిల్ బాలాజి మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు అంత అవసరం ఎందుకని న్యాయమూర్తులు ప్రశ్నించారు. 200 మంది ప్రభుత్వ ఉద్యోగులు సాక్ష్యులుగా ఉన్న నేపథ్యంలో, ఆయన మంత్రిగా ఉంటే ఏం జరుగుతుంది? సెంథిల్ బాలాజి మంత్రిగా కొనసాగాలా? అనే విషయం ఆయన తరఫు వివరణ చెప్పండి. అలా ఆయన మంత్రిగా కొనసాగే పక్షంలో, ప్రాధాన్యత ఆధారంగా విచారణ జరిపించవచ్చంటూ, తదుపరి విచారణ మార్చి 4వ తేదీకి వాయిదావేశారు.
![]() |
![]() |