మంచిర్యాల జిల్లా : సింగరేణి సంస్థ సిఎండి శ్రీ ఎస్ బలరాం. ఐ ఆర్ ఎస్ గారు. ఈ రోజు ఉదయం ఎస్టిపిపి లో నిర్మించిన నూతన శ్రీశ్రీశ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని డైరెక్టర్ శ్రీ ఎల్ వి సూర్యనారాయణ గారు, డైరెక్టర్ కే వెంకటేశ్వర్లు గార్లతో సందర్శించడం జరిగింది వీరికి.ఎస్టిపిపి ఇంచార్జి ఈడి హెడ్ ఆఫ్ దీ ప్లాట్ కే శ్రీనివాసులు గారు పూల మొక్కను బహుకరించగా, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ సిఎండి శ్రీ ఎస్ బలరాం. ఐ ఆర్ ఎస్ గారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం వారికి అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు సి ఎం డి,డైరెక్టర్లను స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించి. స్వామివారి జ్ఞాపకం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిఎండి ఎస్ బలరాం గారు మాట్లాడుతూ ఎస్ టి పి పి సంరక్షణర్థం నూతన రామాలయాన్ని నిర్మించుకోవడం శుభ సూచకమన్నారు. అలాగే ప్లాంటు యొక్క పి ఎల్ ఎఫ్, పనితీరు బాగుందని అధికారులను, ఉద్యోగులను ప్రశoచించడం జరిగింది. ఇదే స్ఫూర్తిని రాబోయే రోజుల్లో కూడా కొనసాగించి ప్లాంట్ ను మంచి అభివృద్ధి పథంలో నడిపించాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ (ఓ & ఎం ) జె ఎన్ సింగ్, ఏఐటియుసి జనరల్ సెక్రెటరీ రాజ్ కుమార్, శ్రీరాంపూర్ బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, ఎస్టిపిపి ఫిట్ సెక్రెటరీ సత్యనారాయణ, సి ఎం ఓ ఏ ఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాస్, ఎంజీఎం సివిల్ ksn ప్రసాదు, ఎంజీఎం ఫైనాన్స్ టీ సుధాకర్, డీజీఎం పర్సనల్ అజ్మీరా తుకారం, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొనడం జరిగింది
![]() |
![]() |