వాకింగ్ చేయడం చాలా ఈజీ. రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. దీర్ఘకాలంలో ఎంతో మేలు జరుగుతుంది. బరువు తగ్గేందుకు కూడా వాకింగ్ బెస్ట్ ఆప్షన్. డయాబెటిస్, బీపీ తగ్గించడంలో కూడా వాకింగ్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే, వాకింగ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది.
ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి అతని ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, బరువు తగ్గడానికి చాలా మంది నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు జిమ్‌లు చుట్టూ తిరుగుతున్నారు. ఇంకొందరు వాకింగ్‌ను ఆప్షన్‌గా తీసుకుంటున్నారు. చాలా మంది చేయగలిగే ఈజీ వ్యాయామం వాకింగ్.
వాకింగ్ చేయడం చాలా ఈజీ. రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. దీర్ఘకాలంలో ఎంతో మేలు జరుగుతుంది. బరువు తగ్గేందుకు కూడా వాకింగ్ బెస్ట్ ఆప్షన్. డయాబెటిస్, బీపీ తగ్గించడంలో కూడా వాకింగ్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే, వాకింగ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఏదో నడిచాంలే అనుకుంటే పొరపాటు. వయసుకు తగ్గట్టుకు వాకింగ్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలంటే ఏ వయసు వారు ఎంత దూరం కవర్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
18-30 ఏళ్ల వయసు
ఈ వయసులో ఉన్నవారు యువకులు. సాధారణంగా చాలా యాక్టివ్‌గా ఉంటారు. యువకుల్లో కండరాలు బలంగా ఉంటాయి. కాబట్టి ఈ వయసు ఉన్నవారు ఎక్కువ దూరం నడవవచ్చని నిపుణులు చెబుతున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ప్రతిరోజూ 12,000 అడుగులు నడిస్తే మంచిదని నిపుణులు మంచిదంటున్నారు. అంతేకాకుండా ఈ వయసు వారు గంట సేపు వేగంగా నడవవచ్చు. ఎందుకంటే ఈ వయసు వారు ఉత్సాహంగా ఉంటారు.
31-50 ఏళ్ల వయసు
ఈ వయసు వారు మధ్య వయస్కులు. యువకులతో పోలీస్తే వీరు అంత యాక్టివ్‌గా ఉండరు. వీరు కండరాలు కొంచెం వీక్‌గా ఉంటాయి. అందుకని వీరు 11000 అడుగులు నడిస్తే మంచిదంటున్నారు నిపుణులు. ఇలా నడవడం వల్ల కండరాలు బలంగా మారుతాయని చెబుతున్నారు. దీంతో.. దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. ఈ వయసు వారు చాలా మంది ఒత్తిడితో బాధపడుతున్నారు. అలాంటి వారికి వాకింగ్ బెస్ట్ ఆప్షన్. రోజుకి 30-45 నిమిషాల పాటు నడవడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది.
51-65 ఏళ్ల వయసు
ఈ వయసు వారు అంత యాక్టివ్‌గా ఉండరు. వయసు వారి శరీరంలో మార్పులు, కండరాలు బలహీనపడటం , జీర్ణవ్యవస్థ మందగించడం వంటి మార్పులు జరుగుతాయి. అందుకే ఈ వయసు వారు కనీసం 10,000 అడుగులు నడిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే, ఒకేసారి నడకపోయినా, రోజు మొత్తంలో ఈ టార్గెట్ కంప్లీట్ చేయవచ్చని అంటున్నారు.
66-75 ఏళ్ల వయసు
ఈ వయసు వారిలో ఆటోమేటిక్‌గా బలం తగ్గిపోతుంది. కండరాలు చాలా బలహీనంగా ఉంటాయి. ఇలాంటి వారికి వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ వయసు వారు రోజూ 8000 అడుగులు నడిస్తే ప్రయోజనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా నడవడం వల్ల వీరు శక్తిని పొందవచ్చు. కావాలంటే ఉదయం 4 వేలు, సాయంత్రం మరో నాలుగు వేలు అడుగులు నడిస్తే మంచిదంటున్నారు ఎక్స్‌పర్ట్స్.
10 నుంచి 18 ఏళ్ల వయసు
ఈ వయసు గల వయస్సు గల పిల్లలు రోజుకు 12000 నుండి 15000 అడుగులు నడవాలి. ఇలా నడిస్తే వారి కండరాలు, ఎముకలు దృఢంగా మారతాయని నిపుణులు అంటున్నారు. ఇక, ఆరోగ్యంగా ఉండటానికి, ఒక వ్యక్తి ప్రతిరోజూ కనీసం అరగంట పాటు నడవాలి లేదా జాగింగ్ చేయాలి. అరగంట పాటు నడవడం ద్వారా, ఒక వ్యక్తి దాదాపు 10,000 అడుగులు నడుస్తాడని నిపుణులు చెబుతున్నారు.
రోజూ నడిస్తే
రోజూ నడవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నడక వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. చెమట పట్టడం వల్ల రక్తంలోని మలినాలు తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు. ఆందోళన, ఒత్తిడి, మానసిక కుంగుబాటుతో బాధపడేవారు రోజూ నడవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ నడవడం వల్ల బీపీ, డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రోజూ నడవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
![]() |
![]() |