కౌటాల మండలం విర్ధండి గ్రామానికి చెందిన ఆత్రం సవిత - శ్రీనివాస్ ల రెండో సంతానం ఆయిన సోనీ కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల పంటల ఉత్పత్తి విభాగం విద్యార్థిని ఆత్రం సోనీ ని సోమవారం ఘనంగా సన్మానించారు.వృక్షశాస్త్ర విభాగాధిపతి పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ తిరుకోవెల శ్రీనివాస్ ప్రతిష్టాత్మకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఆంగ్ల విభాగం జనవరి మూడో తారీకు నుంచి ఫిబ్రవరి 2 తారీకు వరకు ఒక నెల కాలం పాటు. నిర్వహించిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పంటల ఉత్పత్తి విభాగానికి చెందిన ఆత్రం సోనీ కళాశాలకు చేరుకోగానే వృక్ష శాస్త్ర విభాగంలో ఘనంగా సత్కరించారు. సోనీ తన అనుభవాలను వెల్లడిస్తూ 30 రోజుల కాలంలో కమ్యూనికేషన్స్ స్కిల్స్, సెల్ఫ్ మోటివేషన్, వర్డ్ పవర్, సెంటెన్స్ ఫార్మేషన్, కాంప్రహెన్షన్ మొదలైన భాషా నైపుణ్యాలపై లోతైన అవగాహన కల్పించారని, ఈ అవకాశం కల్పించేందుకు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్.
కల్వకుంట రామకృష్ణ మరియు వృక్ష శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ తిరు కోవెల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ తిరు కోవెల శ్రీనివాస్ మాట్లాడుతూ జీవ శాస్త్రి భాగాలకు చెందిన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, జాతీయ సేవా పథకం, ఎన్సిసి, జిజ్ఞాస, యువతరంగం తో పాటుగా వివిధ కో-కరికులర్ విభాగాలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో మెప్పు పొందుతున్నారని, వారిని ప్రోత్సహించి, మిగతా విద్యార్థులు కూడా అదే దిశగా నడిపించాలని అధ్యాపకులను సూచించారు. ఈ కార్యక్రమంలో వృక్ష శాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ పడాల తిరుపతి, డాక్టర్ కందుకూరి కాలజ్యోతి, డాక్టర్ ఆసంపల్లి స్వరూపారాణి, డాక్టర్ మహమ్మద్ తాజుద్దీన్, డాక్టర్ డి రమ్య తదితర విద్యార్థులు పాల్గొన్నారు
![]() |
![]() |