ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ (MI) వారి హోమ్ మ్యాచ్‌ల టికెట్ బుకింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఐకానిక్ వాంఖడే స్టేడియంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టిక్కెట్లను దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. లీగ్ మార్చి 2025 చివర్లో ప్రారంభం కానుండటంతో, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌ను విజయవంతంగా ప్రారంభించాలని చూస్తోంది. టిక్కెట్ల విక్రయం మూడు దశల్లో జరగనుంది. మొదటి దశలో గోల్డ్, సిలివర్ & జూనియర్ సభ్యులు మార్చి 3న సాయంత్రం 4 గంటల నుంచి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. రెండో దశలో బ్లూ మెంబర్స్‌కు మార్చి 4 సాయంత్రం 6 గంటల నుంచి అవకాశం కల్పించనున్నారు. చివరి దశలో మార్చి 6న సాయంత్రం 6 గంటల నుంచి టిక్కెట్లు అందరికీ ఓపెన్ అవుతాయి. ఈ టిక్కెట్లు BookMyShow వంటి అధికారిక IPL భాగస్వామి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రత్యేకంగా లభిస్తాయి.
https://t.co/xCZznIDs5r#MumbaiIndians #TATAIPL pic.twitter.com/6Dvw4GuYYI
— Mumbai Indians (@mipaltan) February 27, 2025
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa