ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చికెన్ సరిగ్గా వండకపోతే రక్తంలో టాక్సిన్లు పేరుకుపోవడమే కాకుండా ఎన్నో సమస్యలు

Technology |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 10:40 PM

చికెన్ సరిగ్గా వండాలి. లేదంటే కోళ్లలో కనిపించే సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల కూడా మీరు ఫుడ్ పాయిజనింగ్‌కు గురవుతారు. అంతేకాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే చికెన్ ఎలా వండాలో ఇక్కడ తెలుసుకుందాం.


చికెన్.. చాలా మంది ఇష్టంగా తినే ఫుడ్. కొంతమందికి చికెన్ లేనిదే ముద్ద దిగదు. ఇక, సండే వచ్చిందంటే చాలు చికెన్‌ను ఓ పట్టు పట్టాల్సిందే. అయితే, ఈ రోజుల్లో చాలా మంది వారంతో సంబంధం లేకుండా చికెన్, మటన్‌ను లాగిస్తున్నారు. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, లాలీపాప్, చికెన్ 65, చికెన్ కూర్మా, చికెన్ సూప్, తందూరి చికెన్ ఇలా రకరకాల పేర్లుతో చికెన్ తింటున్నారు. ఇక, ఆల్కహాల్ తాగేవారు చికెన్‌ను స్టఫ్‌గా తింటున్నారు.


చిన్నా, పెద్దా తేడా లేకుండా చికెన్‌ను ఎక్కువగా తింటున్నారు. చికెన్ తినడం వల్ల శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి. నాటు కోళ్లు తింటే ఆరోగ్యానికి మంచిది.. ఫారం కోళ్లను ఎక్కువగా తింటే అనర్థం తప్పదంటున్నారు. వారానికి ఒకటి, రెండు సార్లు చికెన్ తింటే ఫర్వాలేదు. వారమంతా చికెన్ లాగిస్తే ప్రమాదం. అంతేకాదు చికెన్ సరిగ్గా వండాలి. లేదంటే కోళ్లలో కనిపించే సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల కూడా మీరు ఫుడ్ పాయిజనింగ్‌కు గురవుతారు. అంతేకాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే చికెన్ ఎలా వండాలో ఇక్కడ తెలుసుకుందాం.


చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది


ఈ రోజుల్లో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో పబ్లిష్ అయిన ఒక స్టడీ ప్రకారం సరిగ్గా వండని చికెన్‌ ఎక్కువగా తింటే.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరుగుతాయి. బాడీలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే.. గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్‌, స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్యలు ఉన్నవారు చికెన్ తక్కువ మోతాదులో తింటేనే మంచిదంటున్నారు నిపుణులు. అంతేకాకుండా చికెన్ తక్కువ తింటే ఈ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.


అధిక బరువు


ప్రతిరోజూ చికెన్‌ తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. చికెన్‌లో ప్రోటీన్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో... శరీరం బర్న్‌ చేయలేని అదనపు ప్రోటీన్ కొవ్వు రూపంలో నిల్వ ఉంటుంది. దీనివల్ల త్వరగా బరువు పెరుగుతారు. అందుకే ఇప్పటికే అధిక బరువు సమస్యలతో బాధపడే వారు చికెన్ ఎక్కువగా తినకూడదు.ఒక స్టడీ ప్రకారం, మనం తీసుకునే డైట్‌కు, బరువు మధ్య సంబంధం ఉంటుంది. శాఖాహారుల కంటే నాన్-వెజ్ తినే వారి శరీర ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది.


రక్తంలో ఇన్ఫెక్షన్


అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, చికెన్ ఎక్కువగా తింటే.. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌‌‌‌తో సహా రక్తంలో టాక్సిన్లు పేరుకుపోయే ప్రమాదముంది. ఈ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండాలంటే.. తాజా చికెన్‌ కొనడం, చికెన్‌ తక్కువగా తీసుకోవడం చేయాలి. చికెన్‌ను బాగా ఉడికించి తింటే ఈ సమస్యలు రావంటున్నారు.


అధిక యూరిక్ యాసిడ్


​అధిక యూరిక్ యాసిడ్ స్థాయి ఎవరికైనా ఇబ్బంది కలిగించవచ్చు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిన తర్వాత, క్రమంగా ఈ యూరిక్ యాసిడ్ గట్టిపడటం ప్రారంభిస్తుంది. ఈ స్ఫటికాలు (యూరిక్ యాసిడ్ స్ఫటికాలు) చేతి వేళ్లు, కాలి వేళ్లు, వేరే కీళ్లలో పేరుకుపోతాయి. దీంతో.. కీళ్లనొప్పుల సమస్యతో బాధపడతారు. మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యతో బాధపడుతున్నవారు చికెన్ ఎక్కువగా తినకూడదు. ఇలా చికెన్ ఎక్కువగా తింటే బాడీలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగే ప్రమాదముంది.


చికెన్ ఎలా వండాలి?


మార్కెట్‌ నుంచి తీసుకువచ్చిన వెంటనే చికెన్‌ను బాగా కడగాలి. రాళ్ల ఉప్పుతో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. ఆ తర్వాత చికెన్‌ను 70 డిగ్రీల వద్ద బాగా ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల చికెన్‌పై ఉన్న బ్యాక్టీరియాలు, వైరస్‌లు చనిపోతాయి. ఆ తర్వాత చికెన్ వండుకుంటే మంచిది. అంతేకాకుండా డీప్ ఫ్రైలు, బయట నుంచి తీసుకువచ్చిన చికెన్ ఫ్రై ఐటమ్స్ తినడం మానుకుంటే మంచిది. ఇంట్లోనే తాజా చికెన్‌ను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించి కూర చేసుకుని తింటే మంచిదంటున్నారు నిపుణులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com