ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలా వాడిన నూనెల్ని మళ్లీ వంటల్లో వాడుతున్నారా

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 10:41 PM

పూరీ, పకోడీ, గారెలు ఇలాంటివన్నీ మనం ఫ్రై చేశాక ఆ నూనెల్ని మళ్లీ వంటల్లో వాడతాం. ఇది అందరి ఇళ్లలో చేసేదే. కానీ, దీని వల్ల కొన్ని సమస్యలున్నాయని చెబుతున్నారు. అవేంటంటే


​పూరీ, పకోడా, గారెల వంటివన్నీ చాలా మంది ఇష్టంగానే తింటారు. మంచి క్రిస్పీగా ఉండే ఈ ఫుడ్స్‌కి చాలా మందే ఫ్యాన్స్ ఉంటారు. అయితే, వీటని తినడం వల్ల సమస్యలొస్తాయని కూడా తెలిసిందే. అయితే, ఎప్పుడోసారి తినడం పర్లేదు. అయితే, ఇక్కడ మరో సమస్య ఏంటంటే.. వీటిని ఫ్రై చేసిన నూనెని మళ్లీ వాడడం. తక్కువ నూనెలో ఇలాంటి వంటల్ని చేయలేం. చేసిన నూనెని పారబోయలేం. దీంతో చాలా మంది అదే నూనెల్ని వంటల్లో వాడతారు. దీంతో కొన్ని సమస్యలొస్తాయి. అవేంటి.. వాటన్నింటిని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోండి.


ఆరోగ్య సమస్యలు


నూనెల్ని మళ్లీ తిరిగి వాడడం వల్ల డయాబెటిస్, రక్తపోటు, గుండె సమస్యల వంటి సమస్యలొస్తాయి. అధ్యయనాల ప్రకారం, వంటనూనెల్ని మళ్లీ వేడి చేస్తే విషపూరిత పదార్థాలు విడుదలవుతాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. దీనివల్ల మంట, అనేక సమస్యలొస్తాయి. అందుకే, ఈ నూనెల్ని మళ్లీ వాడకుండా చూడడం మంచిది. అయితే, కొన్నిసార్లు మళ్లీ వాడొచ్చు. ట్రాన్స్‌ఫ్యాట్స్ ఏర్పడకుండా ఉంటే దానిని తిరిగి 3 సార్లు వాడొచ్చు. అదెలా అంటే..


ఎలా చేశారు


మనం నూనెని తిరిగి వాడడమనేది ఏ రకమైన ఫుడ్‌ని అందులో ఫ్రై చేశారు. అది ఏరకమైన నూనె, ఎంత టెంపరేచర్‌లో వేడిచేశారు, ఎంతసేపు వాడారు ఇవన్నీ గుర్తించి వాటి ప్రకారమే వాడాలి. వీలైనంత వరకూ ఈ నూనెని అవాయిడ్ చేయడే మంచిది.


మళ్లీ మళ్లీ వాడితే


నూనెని ఎక్కువగా వేడిచేసి మళ్లీ మళ్లీ వాడితే ట్రాన్స్ ఫ్యాట్స్ పరిమాణం పెరుగతాయి. మన ఆహారాన్ని అనారోగ్యకరంగా చేసే నూనెని తిరిగి వాడినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్ పరిమాణం పెరుగుతుంది. అలాంటి నూనెలో వండిన ఆహారాన్ని తీసుకుంటే హానికరమైన ప్రభావాలు ఉంటాయి. దీని వల్ల విషపూరిత పదార్థాలు విడుదలవుతాయి. దుర్వాసన కూడా వస్తుంది.


ఎక్కువ టెంపరేచర్‌లో వేడిచేస్తే


అధిక ఉష్ణోగ్రతల్లో వేడి చేస్తే నూనె విషపూరిత పొగను విడుదల చేస్తుంది. పొగబిందువు చేరుకోవడానికి ముందే పొగలు వెలువడుతాయి. కానీ, ఉష్ణోగ్రత పొగ బిందువు కంటే ఎక్కువగా ఉంటే పెరుగుతాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఎక్కువసార్లు వేడిచేసినప్పుడు వాసన చెడుగా మారుతుంది. అనారోగ్యకరమైన పదార్థాలు గాలి, వండిన ఆహారంలోకి విడుదలవుతాయి.


ఫ్యాట్ పెరగడం


అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే నూనెలోని కొన్ని కొవ్వులు ట్రాన్స్‌ఫ్యాట్స్‌గగా మారి గుండె సమస్యలకి కారణమవుతాయి. ప్రతీసారి వేడిచేయడం వల్ల విషయవాయువులు విడుదలై ఆహారాన్ని ప్రమాదకరంగా మారుస్తాయి. ఇలా మరోసారి వేడిచేసిన నూనెలతో వండిన వంటలు తినడం వల్ల చాలా సమస్యలొస్తాయి. వీటిని తగ్గించడం మంచిది.


మరేం చేయాలి


విషవాయువులు పెరగకుండా నూనె పదేపదే వేడిచేయొద్దు.


తక్కువ నూనెలోనే ఫ్రై చేయాలి.


వీలైనంతవరకూ నూనె మిగలకుండా చూడాలి.


మాంసాహారం వేయించిన నూనెలు మరోసారి వాడకపోవడమే మంచిది.


మిగతా పదార్థాలు ఫ్రై చేసిన నూనెలు కూడా ఒకసారికి మించి వాడొద్దు.


ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యంగా ఉంటామని గుర్తుంచుకోండి.


గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com