రంజాన్ మాసం ప్రారంభం కావడంతోనే నగరంలో హలీం అమ్మకాలు ఊపందుకున్నాయి. నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టపడే హలీంకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఇక ఈ పవిత్ర మాసం మొత్తం ముస్లిం సోదరులతో పాటు ప్రతి ఒక్కరూ హలీం రుచి చూస్తుంటారు. అయితే, రంజాన్ ఉపవాస దీక్షల్లో ప్రత్యేకించి తీసుకునే ఈ హలీంకి రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.హలీంలో ఎన్నో పోషక విలువలు దాగున్నాయి. ఇందులో మాంసంతో పాటుగా మరెన్నో పోషకాలున్న పప్పు ధాన్యాలు, మసాలా దినుసులు వంటివి ఉపయోగిస్తారు. వీటి వల్ల హలీంని ఒక కంప్లీట్ ఎనర్జీనిచ్చే ఫుడ్ గా భావిస్తారు. హలీం తయారీలో జీడిపప్పు, శెనగపప్పు, మినప్పప్పు వంటి ప్రొటీన్లు ఉండే పప్పులను వాడతారు. ఇవి శరీరంలోని కండరాల్ని బలోపేతం చేస్తాయి. కణజాలాన్ని రిపేర్ చేసి మరింత బలంగా మారుస్తాయి. దీని తయారీలో గోధుమలను అధికంగా వాడతారు. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను గాఢిలో పెట్టడమే కాకుండా ఇందులో ఉండే పీచు పదార్థం ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా ఉంచగలదు. కాబట్టి ఇది బరువు తగ్గాలనుకునే వారికి కూడా చక్కటి ఆహారం. మధుమేహంతో బాధపడేవారు హలీంను చక్కగా తీసుకోవచ్చు. ఇందులో ఉండే సోడియం నాడీ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. గుండె సమసి వున్నవారు ఎక్కువగా తినడం మంచిది కాదు.
![]() |
![]() |