దేశీయ స్టాక్ మార్కెట్లు గత ఆరు నెలలుగా చూసుకుంటే తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. వివిధ రంగాల స్టాక్స్ భారీగా నష్టపోతుండడంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సైతం భారీగా నష్టపోతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత కూడా ఈక్విటీల్లో భారీ నష్టాలే వచ్చాయని చెప్పవచ్చు. గతేడాది 2024 సెప్టెంబర్‌లో జీవన కాల గరిష్ఠాల నుంచి చూసుకుంటే సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 14 శాతం మేర నష్టపోయాయి. ఈ క్రమంలో మ్యూచవల్ ఫండ్స్‌లో స్వల్పకాలిక పెట్టుబడులపై భారీ నష్టాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన ఫండ్ ఎంచుకున్నప్పుడే మంచి లాభాలు అందుకోవచ్చు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చాం. చాలా మంది వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానం ఎంచుకుని పన్ను ఆదా పెట్టుబడులు పెట్టాలని చూస్తుంటారు. మీరు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో రాబడి కోరుకోవడంతో పాటు పన్ను ఆదా చేసుకోవాలనుకుంటే మీకు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS) సరైన ఎంపికగా చెప్పవచ్చు. వీటి ద్వారా రూ.1.50 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో హైరిటర్న్స్ అందుకోవచ్చు. మరి ప్రస్తుతం గత 5 సంవత్సరాల్లో 32 శాతం వరకు లాభాలు అందించిన టాప్- 10 స్కీమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్
ఎస్‌బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్
పరాగ్ పరీఖ్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్
హెచ్‌డీఎఫ్‌సీ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్
బంధన్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్
డీఎస్‌పీ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్
ఫ్రాంక్లిన్ ఇండియా ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్
మీరే అసెట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్
క్వాంటమ్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్
అయితే, గత 5 సంవత్సరాల్లో వచ్చిన రిటర్న్స్ ప్రకారం ఈ జాబితా తయారు చేయడం జరిగింది. కానీ, ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కాదు. అవగాహన కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్స్‌లో సైతం హైరిస్క్ ఉంటుంది. అన్ని తెలుసుకున్నాకే ఇన్వెస్ట్ చేయాలి.
![]() |
![]() |