ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఫ్రాంచైజీ ప్రకటించింది. గతంలో ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్.. ప్రస్తుతం లఖ్‌నవ్‌కు సారథ్యం వహిస్తున్నారు. 2024 సీజన్‌లో అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన చేశాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో 7.65 ఎకానమీ రేటుతో 11 వికెట్లు తీయడమే కాకుండా, 131.28 స్ట్రైక్ రేట్‌తో 235 పరుగులు కూడా చేశాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని 16.50 కోట్లకు రిటైన్ చేసుకుంది.
![]() |
![]() |