ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫేషియల్స్, క్రీమ్స్ బదులు కొన్ని ఫేస్‌ప్యాక్స్ ట్రై చేస్తే ముఖం ఇన్‌స్టంట్‌గా మెరుస్తుంది

Life style |  Suryaa Desk  | Published : Sat, Mar 15, 2025, 10:46 PM

మార్కెట్లో రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో విపరీతంగా కొనుక్కుని వాడుకుంటున్నారు. అయితే, వీటి వల్ల ఇన్‌స్టంట్‌గా రిజల్ట్ అనిపించినా ఇందులోని కెమికల్స్ వల్ల స్కిన్ పాడవుతుంది. అలా కాకుండా సహజంగానే స్కిన్‌ అందంగా కాపాడుకునేందుకు కొన్ని ఫేస్‌ప్యాక్స్ సజెస్ట్ చేస్తున్నారు.


ఈ ఫేస్‌ప్యాక్స్ ట్రై చేయడం వల్ల మృతకణాలు తొలగి చర్మం ఫ్రెష్‌గా అందంగా, కాంతివంతంగా మారుతుంది. దీనికోసం మన ఇంట్లోనే దొరికే కొన్ని పదార్థాలు వాడొచ్చు. అవేంటో తెలుసుకోండి.


బియ్యం పిండితో


కావాల్సిన పదార్థాలు


1 చెంచా బియ్యం పిండి


బొప్పాయి గుజ్జు 2 చెంచాలు


కుంకుమ పువ్వు 2


పాలు 1 చెంచా


తయారీ విధానం


కుంకుమపువ్వుని ఓ గిన్నె పాలలో నానబెట్టండి. బాగా నానిన తర్వాత బొప్పాయి గుజ్జు, బియ్యం పిండి వేసి మెత్తని పేస్టులా తయారుచేయండి. దీన్ని ముఖం, మెడ, చేతులకి అప్లై చేసి కొద్దిగా మసాజ్ చేయండి.


తర్వాత 20 నుంచి 30 నిమిషాలు అలానే ఉంచండి.తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడగాలి.


దీన్ని వారానికి 2, 3 సార్లు వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి.


బెనిఫిట్స్


బియ్యంపిండిలోని బయోయాక్టివ్ సమ్మేళనాలు ముఖ్యంగా ఫైటిక్ యాసిడ్, ఫెరులిక్ యాసిడ్, చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి మృతకణాలను తొలగించి చర్మాన్ని బ్రైట్‌గా చేస్తాయి. కుంకుమపువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ రంగుని మెరుగ్గా చేస్తాయి. కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి. బొప్పాయి గుజ్జులోని ప్రోటీ, కరిగే ఎంజైమ్స్ ముఖ్యంగా పపైన్, చర్మ రంధ్రాలను తగ్గించి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది చర్మాన్ని మృదువుగా, తేమగా చేస్తాయి.


అలోవెరా జెల్, దోసకాయ, బంగాళాదుంప రసం


కావాల్సిన పదార్థాలు


దోసరసం 1 టేబుల్ స్పూన్బంగాళాదుంప రసం 1 టేబుల్ స్పూన్అలోవెరా రసం 1 టేబుల్ స్పూన్.


తయారీ విధానం


ఓ గిన్నెలో దోస, బంగాళాదుంప రసం, కలబంద జెల్‌ని బాగా కలపండి.


దీన్ని ముఖం, మెడకి అప్లై చేయండి.


15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచి ఆపై ముఖాన్ని గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. దీనిని వాడినప్పుడు అప్పటికప్పుడు అందంగా కనిపిస్తారు.


బెనిఫిట్స్


అలోవెరా మెలనిన్ ఉత్పత్తిని తగ్గించి బ్రైట్‌గా చేస్తుంది. దోసకాయ చర్మ మంటను తగ్గిస్తుంది. హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇది చర్మంపై ఉన్న నల్ల మచ్చల్ని తగ్గిస్తుంది రంగుని మెరుగ్గా చేస్తుంది. బంగాళాదుంప రసంలోని సహజ బ్లీచింగ్ గుణాలు చర్మ రంగుని పెంచుతాయి.


వేప, తులసి


కావాల్సిన పదార్థాలు


వేప పొడి 1 చెంచాతులసి 1 చెంచామందార పూల పొడి 1 చెంచా


తయారీ విధానం


పదార్థాలన్నింటికీ కొద్దిగా నీరు కలిపి మెత్తని పేస్టులా చేసి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని బాగా కడగాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ని వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి.


బెనిఫిట్స్


వేపాకు చర్మం నుండి ట్యాక్సిన్స్‌ని దూరం చేస్తుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. తులసి చర్మం ఎర్రబడడాన్ని తగ్గించి తాజాగా, మృదువుగా ఉంచుతుంది. మాందారలోని ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. కొత్త కణాల పెరుగుదలని ప్రేరేపిస్తుంది. చర్మానికి రక్త ప్రసరణని పెంచుతుంది.


గంధం, టమాటతో


కావాల్సిన పదార్థాలు


గంధం పొడి 1 చెంచాటమాట రసం 1 చెంచారోజ్ వాటర్ 1 చెంచా


తయారీ విధానం


ఓ గిన్నెలో టమాట రసం, రోజ్ వాటర్ , గంధం పొడిని కలిపి మెత్తని పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ని ముఖాన్ని క్లీన్ చేసి ముఖానికి రాయండి. 15 నిమిషాలు ఆరనివ్వండి. పూర్తిగా ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో క్లీన్ చేయండి.


ఇలా ప్రతి రెండు రోజులకి ఓ సారి అప్లై చేయాలి.


బెనిఫిట్స్


గంధం - చర్మంపై నల్లని మచ్చలు, ఎర్రని చర్మ దద్దుర్లని త్గిస్తుంది. టమాట రసంలోని బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఇ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇది చర్మానికి సహజ టోనర్‌గా పనిచేస్తుంది.


పసుపు, తేనెతో


కావాల్సిన దార్థాలు


పసుపు పేస్ట్ 1 చెంచాతేనె 2 చెంచాలునిమ్మరసం 1 చెంచా


తయారీ విధానం


నిమ్మరసం, తేనె, పసుపు కలిపి మెత్తగా పేస్టులా చేయండి.


ఇప్పుడు ముఖం కడిగిన తర్వాత ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాలు ఉండండి.


ఆరిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో క్లీన్ చేయండి.


బెస్ట్ రిజల్ట్స్ కోసం వారానికి రెండు సార్లు అప్లై చేయండి.


బెనిఫిట్స్


పసుపులోని కర్కుమిన్ హైపర్‌పిగ్మంటేషన్‌ని తగ్గిస్తుంది. తేనె చర్మాన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది. కాంతివంతంగా చేస్తుంది. నిమ్మలోని ఆమ్లత్వం చర్మాన్ని టైట్ చేస్తుంది. రంధ్రాలను తగ్గిస్తుంది.


వీటితో పాటు


ఫేస్‌ప్యాక్స్ అప్లై చేయడంతో పాటు చర్మాన్ని హైడ్రేట్ చేసేందుకు పుష్కలంగా నీరు తాగాలి. హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి. సూర్యకిరణాల ప్రభావం నుండి చర్మాన్ని కాపాడుకునేందు సన్‌స్క్రీన్‌ని రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. కెమికల్స్‌తో ఉన్న స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడకాన్ని తగ్గించండి. ఈ పనుల వల్ల మీ చర్మాన్ని మెరుస్తూ, కాంతివంతంగా ఉంటుంది. చర్మ రంగు కూడా పెరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com