మహారాష్ట్రలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి చుట్టూ వివాదం రాజకీయ, మతపరమైన నెలకుని.. రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసింది. నాగ్‌పూర్‌లో మార్చి 17న చోటుచేసుకున్న హింసలో 34 మంది పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. తాజాగా, నాగ్‌పూర్ హింసపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగ్ 300 ఏళ్ల కిందట మరణించాడని ఈ అంశం ఇప్పుడు లేవనెత్తాల్సిన అవసరం ఏంటి? అని ఉద్ధవ్ ప్రశ్నించారు. ఒకవేళ సమాధిని తొలగించాలనుకుంటే.. ఎన్డీయేలోని ప్రధాన భాగస్వాములైన ఆంధ్రప్రదేశ్, బిహార్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్‌లను పిలవాలని ఆయన సూచించారు.
ఏపీ, బిహార్‌లో ముస్లిం జనాభాను దృష్టిలో ఉంచుకుని, వారి ఓట్లు టీడీపీ, జేడీ(యూ)లకు ఎంత ముఖ్యమైనవో పరోక్షంగా ఉద్ధవ్ ప్రస్తావించారు. ముఖ్యంగా ఈ ఏడాది చివరిలో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నితీశ్ ప్రస్తావన తీసుకొచ్చారు. నాగ్‌పూర్ హింసాత్మక ఘటన వెనుక ఎవరున్నారంటూ ఉద్దవ్‌ను మీడియా ప్రశ్నించగా... ‘‘నేను ముఖ్యమంత్రి లేదా హోం మంత్రిని కాదు.. హింసవెనుక ఎవరున్నారో ముఖ్యమంత్రిని అడగండి.. ఎందుకంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో ఉంది.. ఒకవేళ సర్కారు విఫలమైతే రాజీనామా చేయాలి.. ఒకవేళ ఔరంగజేబు సమాధిని తొలగించాలని భావిస్తే కనుక మీ మిత్రులు చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్‌లను ఆ సమయంలో ఆహ్వానించండి’’ అని ఉద్ధవ్ ఘాటుగా స్పందించారు.
అటు, బీజేపీపై విమర్శలు గుప్పించిన శివసేన చీఫ్.. ఔరంగజేబు గుజరాత్‌లోనే పుట్టాడని ఎత్తిచూపారు. 1618లో గుజరాత్‌లోని దహోడ్‌లో జన్మించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు.. 1707లో మహారాష్ట్రలోని భింగార్‌లో చనిపోయాడు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీని ఔరంగజేబు చిత్రహింసలకు గురిచేసి.. అత్యంత క్రూరంగా ప్రాణాలు తీశాడు. ఇటీవల శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఛావా సినిమా తర్వాత ఔరంగజేబుపై మరాఠాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సమాధి ధ్వంసం చేస్తామని ఓ వర్గం హెచ్చరించింది. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇదే ఈ అంశంపై మహారాష్ట్ర అసెంబ్లీలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. నాగ్‌పూర్ హింసపై డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే శాసన మండలిలో ప్రసంగిస్తూ... ఎవరి సమాధిని తొలగించాలని ప్రస్తుతం రైట్‌వింగ్ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయో అటువంటి వ్యక్తిని గురించి పొగడటమేంటి? ఆయన అని ప్రశ్నించారు. అలాగే, ఔరంగజేబు అత్యంత క్రూరమైన వ్యక్తని, మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa