ట్యాక్స్ డ్రైవర్‌లకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఓలా, ఉబర్ వంటి సంస్థలు రవాణా వ్యవస్థలో మార్పులు తెచ్చాయి.. కానీ ఎక్కువ కమీషన్ వల్ల డ్రైవర్లు నష్టపోతున్నారు. దీనికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం 'సహకార్ ట్యాక్సీ' సేవను ప్రవేశపెడుతోంది.
ఇది డ్రైవర్లకు నేరుగా లాభం చేకూర్చేలా, కమీషన్ లేకుండా తయారు చేయబడింది. బైక్‌లు, క్యాబ్‌లు, ఆటోలతో చౌక రవాణా అందించడం దీని లక్ష్యం. త్వరలో దేశవ్యాప్తంగా సహకార్ ట్యాక్సీలు అమలులోకి రానున్నాయి.
![]() |
![]() |