గజపతినగరంలోని మదీనా మసీదు లో రంజాన్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. నెలరోజుల పాటు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు నిర్వహించి ప్రార్థనలు జరిపారు. మత గురువు ఖలీమ్ రజా రంజాన్ ప్రాముఖ్యతను వివరించారు. ముస్లిం నేతలు ఎస్ ఏ షరీఫ్, ఎస్ బాబామియా, బాబూలాల్, ప్యారులాల్ సుభాని రహీం తుల్లా తదితరులు పాల్గొన్నారు. గంచాడ మండల కేంద్రంలోని మసీదు వద్ద ముస్లింలు ప్రార్థనలు జరిపారు.
![]() |
![]() |