వైసీపీ నేత ఈ నెల 26న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆయన్ను కుటుంబ సభ్యులు నగరంలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే, ఈరోజు ఉదయం ఏఐజీ ఆసుపత్రి వైద్యులు కొడాలి నాని హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా కీలక ప్రకటన చేశారు. కాసేపట్లో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నట్లు ప్రకటించారు. నాని గుండెలో మొత్తం మూడు వాల్స్ మూసుకుపోవడంతో క్రిటికల్ సర్జరీ చేసి స్టంట్ అమర్చడం లేదా బైపాస్ సర్జరీ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబయిలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ కు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
![]() |
![]() |