2025 IPL లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మరియు పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడనున్నయి. ఈ మ్యాచ్ ఏప్రిల్ 1 న రాత్రి 7:30 గంటలకు (IST) లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ప్రస్తుత సీజన్‌లో ఇది LSG తమ హోమ్ గ్రౌండ్ లో మొదటి మ్యాచ్ ఆడుతుంది. రెండు జట్లు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి బరిలోకి దిగుతున్నాయి. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో PBKS జట్టు అత్యధిక స్కోరుతో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ను గెలుచుకోగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను LSG వారి సొంత మైదానంలో కూడా ఓడించింది. DCతో జరిగిన థ్రిల్లర్ మ్యాచ్‌లో LSG ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయి తిరిగి తన సత్తా చాటింది. ఇంతలో, PBKS ఈ సీజన్‌లో తమ రెండవ మ్యాచ్ ఆడనుంది. ఇరు జట్లు విజయం కోసం చూస్తున్నాయి. చూడాలి ఎవరు గెలుస్తారో..
![]() |
![]() |