శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్: ఇది శాంసంగ్ అత్యంత సన్నని ఫోన్ అవుతుంది. అలాగే ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి BIS సర్టిఫికేషన్ లభించింది, దీనివల్ల భారతదేశంలోకి ప్రవేశించడం సులభం అయింది.ఈ ఫోన్ 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో అమర్చబడి ఉంటుంది. దీనికి 200MP ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ ఉండవచ్చు. ఇది మూడు రంగుల ఎంపికలలో ప్రారంభించే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర రూ. 87,900 ఉండనున్నట్లు తెలుస్తోంది.శాంసంగ్ గెలాక్సీ A52 2018: ఈ ఫోన్ ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఇది శక్తివంతమైన 7300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఇప్పటివరకు అతిపెద్ద బ్యాటరీతో వస్తున్న స్మార్ట్‌ఫోన్ అవుతుంది. ఇది Vivo Y300 Pro రీబ్రాండెడ్ వెర్షన్, మార్చి 31న చైనాలో లాంచ్ అవుతుంది. గ్లేసియర్ సిల్వర్, స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో వచ్చే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 21,999 కావచ్చు. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్: మోటరోలా తన ఎడ్జ్ 60 సిరీస్‌ను భారతదేశానికి తీసుకువస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ 2న లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ 4 రంగులలో లభిస్తుంది. ఇది 50MP ప్రధాన సెన్సార్‌తో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది 5500mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని అధికారిక ధర ఇంకా వెల్లడి కాలేదు.iQOO Z10 5G ఫోన్: ఈ కొత్త తరం Z సిరీస్ స్మార్ట్‌ఫోన్ కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో రానుంది. ఈ మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ 8GB RAM, స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్‌తో రానుంది. ఇది 5000nits గరిష్ట ప్రకాశంతో క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని ధర ఎంత అనేది వెల్లడించలేదు.
వివో V50E: మీరు గమనించవలసిన మరో మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ వివో V50e. ఇది కెమెరా-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్‌లో మీరు అప్‌గ్రేడ్ చేసిన డ్యూయల్-కెమెరా సెటప్‌ను పొందుతారు. ఇందులో 50MP సోనీ IMX882 సెన్సార్‌తో 50MP ప్రధాన కెమెరా ఉంటుంది. ఒక వివాహ పోర్ట్రెయిట్ స్టూడియో, మల్టీఫోకల్ పోర్ట్రెయిట్‌లు, మరెన్నో ఫీచర్లను అందించవచ్చు. అందుకే కెమెరా ప్రియులకు ఇది మంచి ఎంపిక కావచ్చు.
![]() |
![]() |