ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి

business |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 07:49 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ప్రతీకార సుంకాల నుంచి ఫార్మా ఉత్పత్తులను ట్రంప్ మినహాయించడంతో ఆ సూచీ స్టాక్స్ రాణించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 322 పాయింట్లు కోల్పోయి 76,295కి పడిపోయింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 23,250 వద్ద స్థిరపడింది. 


పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (4.34%), సన్ ఫార్మా (3.26%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.92%), ఎన్టీపీసీ (1.97%), ఏషియన్ పెయింట్ (1.82%).


టాప్ లూజర్స్


టీసీఎస్ (-3.98%), టెక్ మహీంద్రా (-3.79%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-3.71%), ఇన్ఫోసిస్ (-3.41%), టాటా మోటార్స్ (-2.64%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com