పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదించిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2024ను కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ముస్లింల పట్ల వివక్షాపూరితమైన బిల్లుగా దీనిని పేర్కొంటూ ఆయన శుక్రవారంనాడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.లోక్‌సభలో బుధవారంనాడు బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా, బిల్లుకు అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. దీంతో లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. అనంతరం గురువారం అర్ధరాత్రి దాటే వరకూ బిల్లుపై చర్చ జరిపి ఓటింగ్ నిర్వహించారు. రాజ్యసభలోనూ బిల్లు గట్టెక్కింది. బిల్లుకు మద్దతుగా 128 మంది, వ్యతిరేకంగా 1232 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది.కాగా, వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని జావెద్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని పలు నిబంధనలను బిల్లు ఉల్లంఘించిందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టిక్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 25 (స్వేచ్ఛగా తమ మతాన్ని అనుసరించడం), ఆర్టికల్ 26 (మత సంబంధమైన వ్యవహారాల నిర్వహణా స్వేచ్ఛ), ఆర్టికల్ 29 (మైనారిటీ హక్కులు), ఆర్టికల్ 300ఎ (ఆస్తిహక్కు)లను ఉల్లంఘించేలా బిల్లు ఉందని తెలిపారు. లోక్‌సభలో కాంగ్రెస్ విప్‌గా పనిచేసిన జావెద్, వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు.
![]() |
![]() |