ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కసారి రెట్రో వాకింగ్ ట్రై చేయండి,,,బరువుతగ్గుతారు

Life style |  Suryaa Desk  | Published : Wed, Apr 09, 2025, 11:20 PM

బరువు తగ్గేందుకు వాకింగ్ బెస్ట్ ఆప్షన్. అయితే, మీరు ఎప్పుడైనా రెట్రో వాకింగ్ గురించి విన్నారా? ఈ రెట్రో వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చాలా మంది బరువు తగ్గడానికి రెట్రో వాకింగ్ ట్రై చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోతున్నారా? ఒక్కసారి రెట్రో వాకింగ్ ట్రై చేయండి, రోజూ పది నిమిషాలు చాలు


ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి అతని ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, బరువు తగ్గడానికి చాలా మంది నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు జిమ్‌లు చుట్టూ తిరుగుతున్నారు. అయితే, చాలా మందిలో ఎక్కువ మార్పు కనిపించడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గలేకపోతున్నారు.


అయితే బరువు తగ్గేందుకు వాకింగ్ బెస్ట్ ఆప్షన్. అయితే, మీరు ఎప్పుడైనా రెట్రో వాకింగ్ గురించి విన్నారా? ఈ రెట్రో వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చాలా మంది బరువు తగ్గడానికి రెట్రో వాకింగ్ ట్రై చేస్తున్నారు. రోజూ కనీసం 10 నిమిషాల పాటు రెట్రో వాకింగ్ చేస్తే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. అసలు ఇంతకీ రెట్రో వాకింగ్ అంటే అంటి? రోజూ ఇది ట్రై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.


రెట్రో వాకింగ్ అంటే ఏంటి?


రెట్రో వాకింగ్ అనేది ఒక వ్యాయామం. సాధారణంగా మనం వాకింగ్ చేసేటప్పుడు ముందుకు నడుస్తుంటాం. అదే రెట్రో వాకింగ్‌లో వెనుకకు నడుస్తుంటాం. అంటే వెనుకకి నడవడాన్నే రెట్రో వాకింగ్ అంటారు. ఇది కండరాలు, మనస్సు, శరీర అనుసంధానికి చాలా మంచి ఆప్షన్. ఇందులో మీరు నిటారుగా నిలబడి వెనుకకు నడవాలి. కేవలం 10 నుంచి 20 నిమిషాల రెట్రో వాకింగ్ ద్వారా లెక్కలేనన్ని ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ రెట్రో వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓ లుక్కేద్దాం.


శరీరం, మెదడు అనుసంధానం


మనం ప్రతిరోజూ నడుస్తాం. దాదాపు అందరూ ముందుకు నడుస్తుంటారు. కాళ్ళు, కండరాలు, మెదడు దానికి అలవాటు పడ్డాయి. ఇలా చేస్తున్నప్పుడు, మన మెదడు పూర్తిగా పనిచేయదు. కానీ మనకు స్వల్ప సంకేతం అందిన వెంటనే కండరాల జ్ఞాపకశక్తి పనిచేయడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా మనసుకు శరీరానికి మధ్య ఉన్న సంబంధం సడలింది. మనం అలవాటు లేని తప్పు దిశలో నడిచినప్పుడు, మెదడు కండరాలకు సరైన సంకేతాలను ఇవ్వాలి. దీంతో శరీరానికి, మెదడుకి అనుసంధానం పెరిగింది. అంటే మీకు చాలా కాన్స్‌ట్రేషన్ పెరుగుతుంది.


ఆస్టియో ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం


వయసు పెరిగే కొద్దీ కీళ్ల ఆరోగ్యం బలహీనపడుతుంది. దీనిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఈ వ్యాధి ఉన్నవారిలో కీళ్ల లోపల దృఢత్వం, వాపు ఉంటుంది. దీని వలన నడుస్తున్నప్పుడు, లేచినప్పుడు లేదా కూర్చున్నప్పుడు నొప్పి వస్తుంది. ఒక పరిశోధన (ref.) ప్రకారం , రెట్రో వాకింగ్ ఈ సమస్య ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్. రెట్రో వాకింగ్ చేయడం వల్ల కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.


బరువు తగ్గడానికి బెస్ట్ ఆప్షన్


​బరువు తగ్గడానికి వాకింగ్ మంచి ఆప్షన్ అని మనకు తెలుసు. అయితే, వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడం చాలా ఆలస్యం అవుతుంది. సాధారణ నడక కంటే వెనుకకు నడవడానికి ఎక్కువ శ్రమ అవసరం. దీని కారణంగా, బర్న్ చేసే కేలరీల పరిమాణం కూడా పెరుగుతుంది. బరువు తగ్గడానికి ఇది సాధారణ నడక కంటే మంచిది. బరువు తగ్గే ఫలితాల్ని త్వరగా చూపుతుంది. అందుకే బరువు తగ్గడానికి రెట్రో వాకింగ్ ట్రై చేస్తే మంచిదంటున్నారు నిపుణులు.


మానసిక ప్రశాంతత


రెట్రో వాకింగ్ శరీర అవగాహనను పెంచుతుంది. నిద్ర చక్రం మెరుగుపడుతుంది. మీ ఆలోచించే, నేర్చుకునే, గుర్తుంచుకోగల సామర్థ్యం పెరుగుతుంది. మీరు ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడుతుంటే ఖచ్చితంగా దీన్ని ప్రయత్నించండి. రెట్రో వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని నిపుణులు అంటున్నారు. మీరు రెట్రో వాకింగ్ నేర్చుకున్న తర్వాత, దానికి కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఫలితాలను పెంచుకోవడానికి, ప్రతిరోజూ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. క్రమంగా వేగంగా వెనుకకు నడవడానికి ప్రయత్నించండి. ఆ తరువాత వెనుకకు జాగింగ్ చేయండి.


కండరాలు బలంగా


బ్యాక్‌వర్డ్ వాకింగ్ అనేది శరీరంలోని కండరాలు, హామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్ వంటివి నిమగ్నం చేసే ఒక చర్య. ఇవి సాధారణ నడకలో తరచుగా నిర్లక్ష్యం చేయబడతాయి. రెట్రో వాకింగ్ కండరాలన్నింటినీ బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. రెగ్యులర్‌గా రెట్రో వాకింగ్ చేయడం వల్ల కండరాలు బలంగా మారతాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com