అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోటవురట్ల మండలంలోని కైలాసపట్నంలో ఉన్న ఓ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఒక్కసారిగా భారీ పేలుడు, మంటలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఏర్పడింది. భారీ అగ్నిప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం గురించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను నియంత్రించే పనిలో పడ్డారు. మరోవైపు నెల్లూరు జిల్లాలో శనివారం గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.
మరోవైపు బాణాసంచా కేంద్రంలో పేలుడు ఘటనలో ఆరుగురు కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. మరో ఏడుగురు కార్మికులు గాయపడినట్లు సమాచారం. ప్రమాదంలో చనిపోయిన వారు సామర్లకోటకు చెందిన వారిగా తెలిసింది. కూలీ పని కోసం వచ్చి మృత్యువాత పడ్డారు. మరోవైపు పేలుడు ఘటనతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఏర్పడింది. బాధితుల ఆర్తనాదాలు, చనిపోయిన వారి బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. పేలుడుకు కారణాలు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పేలుడుకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.
బాణాసంచా తయారీ కేంద్రం కావటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మృతుల సంఖ్య పెరుగుతోంది. భారీ పేలుడుతో ఘటనా స్థలిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బాణాసంచా కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన కార్మికులను నర్సీపట్నం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ఘటనాస్థలికి బయల్దేరారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న వంగలపూడి అనిత అక్కడి నుంచి అనకాపల్లి జిల్లాకు బయల్దేరారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఇప్పటికే హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు.
![]() |
![]() |