ఇటీవల కాలంలో హిట్స్ అందుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతున్న నటి మీనాక్షి చౌదరి. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆమె కోసం పలు క్రేజీ ప్రాజెక్టులు ఎదురుచూస్తున్నాయి.కాగా, మీనాక్షి చౌదరి నేడు తిరుమలలో సందడి చేశారు. ఇవాళ వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆమెకు అధికారులు ఆలయంలోకి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీనాక్షి చౌదరిని చూసేందుకు జనాలు ఆసక్తి చూపించారు. తనను విష్ చేసిన వారికి తిరిగి అభివాదం చేస్తూ ఆమె ముందుకు సాగారు.
![]() |
![]() |