గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. గాలి బీభత్సానికి వెదురుకుప్పం మండలం, కనకాపురంలోని పలు ప్రాంతాలలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగి భారీ నష్టం జరిగినట్లు స్థానికులు తెలియజేశారు. ఉరుములు మెరుపులు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు బయట ప్రదేశాలలో తిరుగు రాదని , హఠాత్తుగా మారుతున్న వాతావరణం పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేశారు.
![]() |
![]() |