టిడిపి అధిష్టానం ఆదేశాలు మేరకు 2024-26 టిడిపి సభ్యత్వ కార్డులను శింగనమల మండల కేంద్రంలో టిడిపి శ్రేణులకు పంపిణీ చేసిన బండారు శ్రావణి శ్రీ .ఈ సందర్బంగా బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ ... దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , జాతీయ టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి, ఎన్నో టీడీపీ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. టిడిపి సభ్యత్వం కలిగిన శ్రేణులుకు భీమా సౌకర్యంతో పాటు, పిల్లల చదువులకు, ఉద్యోగ కల్పన జరుగుతుంది. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు నుంచి కార్యకర్తల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. అంతేగాకుండా సమాజంలో కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ టీడీపీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
![]() |
![]() |