ఇంట్లో తమ్ముడు చేసిన దొంగతనానికి అక్క, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక జిల్లా చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని కాడుగోళ గ్రామంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన సుశీల(30)ను చూసేందుకు తమ్ముడు మాదేవ వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్టు ఉండక బావ మహేశ్ మొబైల్ ఫోన్, నగదు వెంట తీసుకెళ్లాడు. గుర్తించిన మహేశ్బా వమరిదికి ఫోన్ చేసి దుర్భాషలాడాడు. ఇంటికొచ్చి ఇలాంటి పనులేంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది వారిద్దరి మధ్య వాగ్వివాదానికి కారణమైంది. అనంతరం మహేశ్ తన భార్య సుశీలతోనూ గొడవపడ్డాడు. ఆమె తమ్ముడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అవమానభారంతో రగిలిపోయిన సుశీల ఆదివారం రాత్రి ఇంటి నుంచి ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లింది. పుట్టింటికి వెళ్లి ఉంటుందని మహేశ్ భావించాడు. అయితే, సోమవారం గ్రామంలోని ఓ బావి వద్ద సుశీల చెప్పులు, తాళిబొట్టు, ఇతర వస్తువులను గ్రామస్థులు గుర్తించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో గాలించారు. సుశీల, పిల్లలు దివ్య (11), చంద్రు (8) మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |