AP: నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్‌షీట్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడాన్ని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఖండించారు. ‘దేశంలో కాంగ్రెస్ ఎదుగుదలను బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తోంది. కాంగ్రెస్ అంటే బీజేపీకి భయం పట్టుకుంది. మనీనే లేని కేసులో మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపించడం దారుణం.’ అని బుధవారం షర్మిల ట్వీట్ చేశారు.
![]() |
![]() |