దేశ లౌకిక వ్యవస్థకు భంగం కలిగిస్తూ, రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా చేసిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్ట్‌లో రిట్ 19575/2025 దాఖలు చేయడం ద్వారా వైయస్‌ఆర్‌సీపీ న్యాయపోరాటం సాగిస్తుందని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తమ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ, తెలుగుదేశం, జనసేనలు మత విద్వేషాలను రగిలించి, ప్రయోజనం పొందాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఈ చట్టాన్ని సమర్థించడం ద్వారా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ముస్లీంల మనోభావాలను గాయపరిచారని మండిపడ్డారు. అయన మాట్లాడుతూ.... హిందూ ఆలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగస్తులుగా కూడా ఉండటానికి వీలు లేదని ఎండోమెంట్ చట్టం చెబుతోంది. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో ఎండోమెంట్ విభాగాన్ని పర్యవేక్షించే అధికారి హిందువు కాకుండా ఉంటే హిందువులుగా మనం అంగీకరిస్తామా? కానీ 1995 వక్ఫ్ చట్టానికి కేంద్రం తాజాగా తీసుకువచ్చిన సవరణ ప్రకారం వక్ఫ్ బోర్డ్‌కు కానీ, కేంద్ర వక్ఫ్ కమిటీకి చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ముస్లిం అయ్యి ఉండాల్సిన అవసరం లేదని చట్ట సవరణ చేశారు. ఇది ధర్మమా అని ప్రశ్నిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గతంలో బాప్టీజం తీసుకున్నారు, తరువాత ముస్లిం సంప్రదాయాలను పాటిస్తున్నాను అని చెప్పారు. డిప్యూటీ సీఎం అయిన తరువాత డిక్లైర్డ్ సనాతన ధర్మ పరిరక్షకుడుగా అవతారం ఎత్తారు. కాబట్టి ఆయనను ప్రశ్నించడం అనవసరం. మిగిలిన చంద్రబాబు, లోకేష్ లను వైయస్‌ఆర్‌సీపీ నుంచి సూటిగా ప్రశ్నిస్తున్నాం అన్నారు.
![]() |
![]() |