విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ వ్యవహారంపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉంది? ఏ స్థాయిలో అధికారులు సహకరించారు? అన్న అంశాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. కాపీయింగ్‌కు దారితీసిన వ్యవస్థాగత, వ్యక్తిగత లోపాలపై దృష్టి సారించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకొనే దిశగా నివేదిక ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగవారం మంత్రి సత్యకుమార్ ఒక ప్రకటన చేశారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో గత వారం ఐదుగురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు. ఇందులో నలుగురు మంగళగిరిలోని ఓ ప్రముఖ మెడికల్ కాలేజీకి చెందిన వారు ఉన్నారు.
![]() |
![]() |