భారతీయ రైల్వే భారీస్థాయిలో ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా చేసినవారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వయోపరిమితి విషయానికి వస్తే 2025 జులై 1 నాటికి 30 ఏళ్లు మించకూడదని, రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులకు సడలింపులు ఉంటాయని పేర్కొంది. ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ మే 11తో ముగుస్తుందని వెల్లడించింది. సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500, మిగతా అభ్యర్థులు రూ.250 చెల్లించాలని పేర్కొంది. రైల్వే శాఖ అధికారిక వెబ్ సైట్ లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు.
![]() |
![]() |