వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి ఆలయంలో భారీ స్కాం జరిగిందని, కోట్లాది రూపాయల తులాభారం కానుకలను ఇంటి దొంగలు కాజేసారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారికి మొక్కులు చెల్లింపులో భాగంగా భక్తులు వివిధ రూపంలో తులాభారం సమర్పిస్తారని, తులా భారం ద్వారా నిత్యం 10 లక్షల రూపాయలు.. కానుకలను భక్తులు సమర్పిస్తున్నారన్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో కోట్లాది రూపాయల తులా భారం కానుకలను స్వాహా చేశారన్నారు.తులా భారంలో అక్రమాలు జరిగినట్లు విజిలేన్స్ నివేదిక ఇస్తే.. అధికారులు తాత్కాలిక ఉద్యోగులను తొలగించి మిన్నకుండిపోయారని భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. తులా భారంలో అక్రమాలపై విజిలేన్స్ విచారణకు డిమాండ్ చేస్తున్నామన్నారు. శ్రీవారి ఆలయం వద్ద డ్రోన్ ఎగరడం.. నిఘా వైపళ్యంగా భావిస్తున్నామన్నారు. భద్రతా సిబ్బంది కొరత వుందని.. సిబ్బందిని కూడా పెంచుతామని ఆయన తెలిపారు. త్వరలోనే యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకొస్తామని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
![]() |
![]() |