ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఓ ఆసక్తికర వీడియో పంచుకున్నారు. ఇందులో చంద్రబాబు జీవిత ప్రస్థానం యావత్తు చూపించారు. ఓ వ్యక్తి వ్యాఖ్యానంలో చంద్రబాబు జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఈ వీడియో సాగుతుంది.దీనిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందిస్తూ 75 ఏళ్ల చంద్రబాబు గారి జీవితం రెండు నిమిషాల్లో చూపించిన అద్భుత వీడియో అని అభివర్ణించారు. జీవితంలో ఇన్ స్పిరేషన్ కావాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తే చాలు కొండనైనా ఢీకొట్టే కాన్ఫిడెన్స్ వస్తుంది అని పేర్కొన్నారు.
![]() |
![]() |