ఆఫ్రికన్ దేశాల్లో మలేరియా బెడద ఎక్కువ. ఈ వ్యాధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు 2001 నుంచి అక్కడి ప్రభుత్వాలు ఏప్రిల్ 25న 'ఆఫ్రికా మలేరియా డే' నిర్వహించేవి. ప్రపంచవ్యాప్తంగా మలేరియాను నియంత్రించాలనే ఉద్దేశంతో WHO 2007, మేలో జరిగిన 60వ అసెంబ్లీలో ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా 'వరల్డ్ మలేరియా డే'గా జరుపుకోవాలని తీర్మానించింది. 2008 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.
![]() |
![]() |