పహల్గామ్ ఉగ్రదాడిపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. ఈ దాడితో రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా సాధించిన ఆర్థిక, దౌత్య అభివృద్ధి ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మేము ఊహించని స్థితిలో ఉన్నాం. రక్తపాతం, ఆందోళన, మార్పు, క్షోభ అన్నీ జరిగాయి. అయితే కొంతవరకూ మాత్రం ఏమీ మారలేదు," అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దాడి వల్ల పాకిస్తాన్‌కి అంతర్జాతీయ వేదికలపై మళ్లీ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించే అవకాశాన్ని ఇచ్చినట్టయిందని కూడా ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి దాడులు రాష్ట్రంలో శాంతి, అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయుతున్నాయని ఒమర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి కొన్నేళ్లుగా పెట్టిన కృషికి ఇది పెద్ద దెబ్బ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన సూచించారు. ఈ దాడి రాష్ట్ర భద్రతా పరిస్థితులపై పునరాలోచన చేయాల్సిన అవసరాన్ని స్పష్టంగా చూపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
![]() |
![]() |