ప్రధాన యాప్‌లో UPI చెల్లింపు సేవలు ఇప్పుడు పునరుద్ధరించారు. అయితే సోమవారం సాయంత్రం భారతదేశం అంతటా అంతరాయం ఏర్పడి వినియోగదారులు లావాదేవీలను పూర్తి చేయలేకపోయారు.ఇది ఒక నెలలోపు మూడవసారి ఇటువంటి అంతరాయం ఏర్పడింది. ఇది డిజిటల్ చెల్లింపుల విశ్వసనీయత గురించి కొత్త ఆందోళనలను రేకెత్తిస్తోంది.చెల్లింపులు విఫలమైన లేదా ఆలస్యమైనట్లు నివేదించే వినియోగదారుల నుండి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఫిర్యాదులతో నిండిపోయాయి. సర్వీస్ అంతరాయాలను పర్యవేక్షించే డౌన్‌డెటెక్టర్, అదే సమయంలో నివేదికలలో పెరుగుదలను నమోదు చేసింది.వినియోగదారులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ అంతరాయం చాలా మంది వ్యాపారులు, వినియోగదారులను పీక్ అవర్స్ సమయంలో ప్రభావితం చేసింది. దీని వలన విస్తృతమైన అసౌకర్యం ఏర్పడింది.ఆ తర్వాత ఫోన్‌పే X (గతంలో ట్విట్టర్)లో అంతరాయం ఏర్పడటానికి గల కారణాన్ని వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. "గత వారం వివాదం తీవ్రమవడంతో ఫోన్‌పేలో తాము తమ నెట్‌వర్క్ ఫైర్‌వాల్‌పై సైబర్ భద్రతా చర్యలను పెంచుతూ చురుకైన కసరత్తులను ప్రారంభించామని కంపెనీ తెలిపింది. ఈ సాయంత్రం, మా అన్ని సేవలలో మా ట్రాఫిక్‌లో 100 శాతం కొత్త డేటా సెంటర్ ద్వారా సేవలు అందిస్తున్నామని, దృష్టవశాత్తు సోమవారం సాయంత్రం ట్రాఫిక్ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో నెట్‌వర్క్ సామర్థ్యం తగ్గుదల కనిపించిందని తెలిపింది.ఇదిలా ఉండగా, పేటీఎం సేవలలో ఎలాంటి అంతరాయం లేదని పేటీఎం సంస్థ స్పష్టం చేసింది. ఇతర సర్వీసుల్లో అంతరాయం ఏర్పడినప్పటికీ మా సర్వీసుల్లో ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని, తమ సేవలు సజావుగానే సాగుతున్నాయని Paytm X ద్వారా ధృవీకరించింది.
![]() |
![]() |