గోరంట్ల మండల కేంద్రంలో జరుగుతున్న ప్రత్యేక అవసరాల పిల్లల ఆడిషన్ ప్రాజెక్టును గురువారం కోఆర్డినేటర్ దేవరాజ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాలలో ప్రత్యేక అవసరాల పిల్లల వివరాలను డోర్ టు డోర్ సర్వే ద్వారా సేకరించాలని సూచించారు.
పిల్లలను గుర్తించి, తగిన విద్యా సంస్థల్లో చేర్పించే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, చిన్నారులకు సదరం స్లాట్ నమోదు చేసి, అవసరమైన సర్టిఫికెట్ రావడంలో సహాయం చేయాల్సిన అవసరం ఉందని వివరించారు.
ప్రభుత్వం ప్రత్యేక అవసరాల పిల్లల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఆ పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అధికారులు, వాలంటీర్లు సమన్వయంతో పని చేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవరాజ్ పిలుపునిచ్చారు.
![]() |
![]() |