తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి సీతంపేటకు చెందిన 11 మంది కుటుంబ సభ్యులు విజయవాడ కనకదుర్గ దర్శనానికి ఆటోలో బయలుదేరారు. కృష్ణంపాలెం జాతీయ రహదారిపై ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa