ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ద్వాదశ లగ్న జాతకులపై తండ్రి ప్రభావము

Astrology |  Suryaa Desk  | Published : Sun, Jun 15, 2025, 11:57 AM

1) మేష లగ్నం: ఈ లగ్నం వారికి సాధారణంగా తమ తండ్రి ఆధ్యాత్మికంగాను నైతికంగా నూఅభివృద్ధి పరమైన లక్షణాలు కలిగి ఉండుట వలన, పిల్లలు వారి సలహాలు వింటూ ఉండుట వలన అభివృద్ధిలోకి వస్తారు. తండ్రి గారు లక్ష్య సాధన కలిగిన వ్యక్తి కనుక వారిని ఆదర్శవంతంగా తీసుకుని పిల్లలు ముందుకు వెళ్తారు. సరదాలు, సాహసాలు చేస్తారు. ప్రయాణాలు ఇష్టపడతారు. బంధనాలను ఇష్టపడరు. కుటుంబ సమేతంగా సాహస యాత్రలను ఇష్టపడతారు. వారిని నిరంతరం తిప్పుతూనే ఉంటారు. వీరు ఫాదర్స్ గా ది బెస్ట్ అయితే ఇంట్లో ఉంటే మాత్రం ఆందోళన పడుతుంటారు


2) వృషభ లగ్నం: ఈ లగ్న వ్యక్తుల తండ్రి గారు ఆర్థికంగా నైపుణ్యాలను ఆర్జించిన వ్యక్తిగా పట్టుదల కలిగిన వ్యక్తిగా, చేసే పనిని శ్రద్ధగా చేయుటవలన కార్యసిద్ధికి సంకేతంగా ఉంటారు. పిల్లలు వీరిని ఆదర్శంగా తీసుకుంటారు మీరు చెప్పిన మాట వింటారు తమ పిల్లలను అనేక యాక్టివిటీల కోసం సిద్ధం చేయడానికి ప్లాన్ చేసేవారిలో మొదటివారుగా ఉంటారు. తండ్రిగా ప్రతి అంశం గురించి వారికి బోధించడంలో ఆనందిస్తారు. ఇంకా, తండ్రులు విశ్వసనీయతను ఇష్టపడతారు. సున్నిత మైనా విషయాలలో అతి ప్రేమతో పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటారు.


3) మిధున లగ్నం: ఇతరుల చేత పని చేయించి గలిగిన నేర్పు గలిగిన తండ్రి వీరికి లభిస్తారు. ఆ కారణంగా తండ్రి సంస్థల నిర్వాహకుడిగా ఎక్కువ అభివృద్ధిని సాధిస్తారు ఆ కారణంగా తండ్రికి పిల్లవాడితో వెచ్చించే సమయం తగ్గిపోవటం వలన ఆత్మీయత కొరవడుతుంది. దానివలన తన కష్టాలకి తండ్రే కారణం అన్న భావాన్ని పిల్లవాడు పొందే అవకాశం ఉంది అందువల్ల తండ్రి కొంత సమయాన్ని పిల్లవాడితో వెచ్చిం చుట వలన ఇద్దరి మధ్య ఆత్మీయతా పెంచుకో గలుగుతార.తండ్రులు జీవితంలో వారికంటూ రూల్స్ పెట్టుకుని ముందుకు సాగుతుంటారు. ఇది పిల్లలను ఇబ్బందుల్లో పడేస్తుంది. తండ్రులు తమ పిల్లలను సృజనాత్మక ప్రపంచం, కళలను అన్వేషించమని ప్రోత్సహిస్తున్నప్పటికీ, ప్రాపర్ షెడ్యూల్‌కి కట్టుబడి ఉండరు.


4) కర్కాటక లగ్నం: ఈ లగ్నం వారికి తండ్రికి ఊహాశక్తి అధికంగా ఉంటుంది. నూతన ఆవిష్కరణలు సంగీత సాహిత్యాలు కళలు విద్య చేసే అవకాశం ఉంది. పిల్లవాడికి ఆదర్శవంతంగా ఉంటాడు. ఆశించిన స్థాయిలో పిల్లవాడు ఎదుగుదల ఉండకపోవడం వల్ల , తండ్రి ఊహ స్థాయికి తగినట్టుగా కుమారుడు ఉండక పోవడం వలన తండ్రికి అసంతృప్తి ఉంటుంది. తండ్రి కళాత్మకం, భావోద్వేగం, దయగలవారు, ఉదారంగా ఉంటాడు. కానీ వారిని ఇతర రాశులవారి నుండి భిన్నంగా ఉంచే ఒక విషయం ఏమిటంటే, ఒకసారి ఒకే విషయంపై దృష్టి పెట్టలేకపోవడం. అయితే.. పిల్లలు పిల్లలే.. తమ తల్లిదండ్రుల మానసిక స్థితిగతులను పట్టించుకోరు. అయినా కూడా.. తండ్రి పిల్లలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.


5) సింహ లగ్నం: తండ్రి క్రమశిక్షణ కలిగి ఉంటాడు. చిన్నతనం వల్ల తండ్రి చెప్పిన క్రమశిక్షణ బాధాకరంగా తోచిన తరువాత స్థాయిలో తండ్రి యొక్క గొప్పదనాన్ని గుర్తించి పిల్లవాడు అభివృద్ధిని సాధిస్తాడు.వారు సాధారణంగా, చాలా సీరియస్ వ్యక్తులు. ఈ రాశి తండ్రులూ దీనికి మినహాయింపు కాదు. వారు పూర్తిగా నిబద్ధత కలిగి ఉంటారు, పిల్లలు వారి అభిరుచిని అనుసరించడానికి, కళాత్మక నైపుణ్యంపై దృష్టి పెట్టడానికి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తారు. అయితే ఈ రాశి తండ్రులతో సమస్యలున్నాయి. పిల్లలతో ఓపికగా వ్యవహరించడంలో వీరు కాస్త ప్రాక్టీస్ చేయాలి. ఏదేమైనా వీరు చాలా కమిటెడ్ తండ్రులు. మరింత సహనం అలవరుచుకోవాలి.


6) కన్యా లగ్నం: ఈ లగ్నం వారికి బాధ్యత వహించే వ్యక్తిగా ఉంటాడు తండ్రి. కుటుంబాన్ని ముందుగా ప్రేమిస్తాడు. సకాలంలో పనులు నిర్వర్తించాలని పట్టుదల అధికముగా ఉంటుంది పిల్లవాడు కాలం నియమాలను పాటించకపోవడం అసంతృప్తికి గురి అవుతాడు. ఆ విలువలు అన్ని అనంత కాలంలో పిల్లలు గుర్తించగలుగుతారు తండ్రులు తమ పిల్లల పట్ల చాలా ఓపికగా ఉంటారు. బాగా బ్యాలెన్స్ డ్ గా ఉంటారు. . వీరు చాలా రక్షణ గా ఉంటారు. చాలా మొండి గా ఉంటారు. ఈ లక్షణాల వల్లే వీరికి కుటుంబం అంటే చాలా ఇష్టం, ప్రేమ ఉంటాయి.పిల్లల ఎదుగుదలతో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.మిగతా రాశులన్నింటిలోనూ ఈ లగ్నం వారి తండ్రులు కొంత ప్రత్యేకము.


7) తులా లగ్నం: ఈ లగ్నములో వారికి ఆచితూచి వ్యవహరించడం వల్ల తొందరపాటు నిర్ణయాలు లేకుండా ఉంటాడు తండ్రి. కొన్నిసార్లు తన ఆలోచనకి తనే వ్యతిరేకంగా ఆలోచించి కీడెంచి మేలు ఏంచేవిధానంలో ఉండడం వలన పిల్లవాడికి ప్రారంభములో చికాకులు కలిగిన దాని విలువలు తరవాత తెలుస్తాయి. ఈ లగ్నం పిల్లల తండ్రి సరదాగా కలిగిన వ్యక్తిగా కలిసిపోతూ ఉంటారు, ఇతరులను ఇబ్బంది పెట్టే మనస్తత్వం వుండదు మొహమాటము, వారు ద్విముఖులుగా ప్రసిద్ధి. వీరు ఒకసారి పిల్లలతో ఎంతో ప్రేమగా, ప్రశాంతంగా, కరుణతో ఉంటారు. మరు నిముషంలోనే.. ముఖ్యమైన ప్రాజెక్టు పనుల్లో బిజీ అయిపోయి గంటల తరబడి అందులో మునిగిపోయి. లోకాన్నే మరిచిపోతారు. ఈ రెండు లక్షణాలను ఈ లగ్నం ఉన్న పిల్లల తండ్రులు సమన్వయం చేసుకోగలిగితే మిగతారాశి తండ్రులకంటే ఒకడుగు ముందుంటారు.


8) వృశ్చిక లగ్నం: ఈ లగ్నము వారికి సౌమ్య స్వభావం మాతృప్రేమ ఉన్న వ్యక్తి తండ్రి. అందువలన పిల్లల తప్పులను కూడా క్షమించగలరు. అందువలన అనంతర కాలంలో చిక్కులు ఎదురౌతాయి. చాలాజాగ్రత్తగా ఎక్కువ. పొదుపు ఎక్కువ. అనవసరమైన ఖర్చులు చెయ్యరు. ఇతరులతో వాగ్వాదానికి దిగరు. కొందరు తన పనేదో తను అన్నట్టుగా ఉంటారు తానూ తన కుటుంబం. తండ్రులు అప్పుడప్పుడు ఒత్తిడికి గురవుతుంటారు. అయితే, మరోవైపు పిల్లలను ఎంతో బాగా చూసుకునే లక్షణం వీరి సొంతం. వీరు చాలా భావోద్వేగులు. వారి పిల్లలు ఏడ్చినప్పుడు వీరూ ఏడ్చేస్తారు. అది వారిని బాగా ప్రభావితం చేస్తుంది. వారు తమ పిల్లలకు ప్రేమ పంచడంతో, శ్రద్ధ చూపించడంలో మంచి తండ్రులుగా ఉండటానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు.


9) ధనుస్సు లగ్నం: ఈ లగ్నం వారికి నాయకత్వ లక్షణాలు కలిగిన తండ్రి. పిల్లలు ను తక్కువగా పట్టించుకోవడం వల్ల పిల్లలకి తండ్రి మీద విముఖత ఏర్పడే అవకాశాలు. కొన్ని సందర్భాలలో దురలవాట్లకు లోనయ్యే అవకాశం కూడా ఉంది. చిన్నతనం నుంచి ఆదర్శ లక్షణాలు కలిగిన బంధు వర్గీయులు వీరిని కాపాడినట్లు అయితే కొంతవరకు మంచి మార్గాన్ని అనుసరించే లక్షణం ఉంటుంది ఆ కారణంగా ఎక్కువమంది గా తల్లికి దగ్గరగా ఉండడం జరుగుతుంది. ఈ లగ్నం పిల్లల తండ్రులు మొండివారు. ఇతర రాశిచక్రాలకు చెందిన తండ్రులతో పోలిస్తే ఎక్కువ మొండితనం ఉన్న తండ్రులు. కానీ వీరి ప్రత్యేకత ఏమిటంటే, వారి పిల్లలతో చాలా ఉల్లాసంగా ఉండటానికి ఇష్టపడతారు. పిల్లలు వారు కోరుకున్నంత సమయం తమ తండ్రులతో ఆడుకోవడానికి ఇష్టపడతారు. తండ్రులు కూడా వారి పిల్లలతో కలిసి ఆడతారు. అంతేకాకుండా, నాన్నలు పిల్లల లాంటి స్థితిలో ఉండటానికి ఇష్టపడతారు. పిల్లలతో ఉన్నప్పుడు బాగా ఆనందిస్తారు. తండ్రులకుండే మొండితనం వారు పిల్లలతో ఎంత చనువుగా ఉన్నా...వారి పిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి వారిని ప్రోత్సహిస్తుంది.


10) మకర లగ్నం: ఆకర్షణ ప్రధానంగా వ్యాపారాది నైపుణ్యాలతోవీరి తండ్రి రాణిస్తాడు. భాషా నైపుణ్యాలు అధికంగా ఉంటాయి, గణిత శాస్త్రం పై మక్కువ. కూడా అనేక విషయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. తండ్రి బిడ్డల మధ్య సఖ్యత అధికంగా ఉంటుంది ఇద్దరు స్నేహితుల వ్యవహరిస్తారు. పిల్లలు తండ్రిని అనుకరిస్తారు. వారు దృఢ నిశ్చయం, కచ్చిత అభిప్రాయాలు, దృఢ సంకల్పం గల తండ్రులు. వారు తప్పనిసరిగా తమ పిల్లల ఇష్టాలకు అంతగా అనుగుణంగా ఉండనప్పటికీ తమ పిల్లలతో చక్కటి అటాచ్ మెంట్ కలిగిఉంటారు. వారు పిల్లలనుంచి మంచి ప్రవర్తన మాత్రమే కోరుకుంటారు. దీనివల్ల చాలాసార్లు వీళ్లు బాధపడతారు. ఏడుస్తారు కూడా. అయితే, వీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే... పిల్లల్ని తాము అనుకున్నదే సాధించాలని బలవంతం చేయడం కంటే వారిని గమనిస్తూ ప్రోత్సహించాలి. అప్పుడే పిల్లలు జీవితంలో చాలా ఎదుగుతారు. జీవితంలో క్రమబద్ధంగా ఉంటారు


11) కుంభ లగ్నం: వీరి తండ్రి న్యాయ ప్రాధాన్యత కలిగిన వ్యక్తిగా, ఉండడంవల్ల చిన్నతనంలో తన సొంత వారిని అయిన దండించే లక్షణాలు ఉండడంవల్ల పిల్లలని కొంత క్రమశిక్షణతో పెంచగలరు. ఇంటిని, తమ చుట్టుపక్కల వాతావరణాన్ని కళాత్మకంగా ఉంచడానికి ఇష్టపడతారు. అందువలన పిల్లలు కొంత దూరం గా చూస్తారు అయినప్పటికీ తరువాత కాలంలో మంచి మార్గంలో తనని అట్టే పెట్టినందుకు పిల్లవాడు సంతోషిస్తాడు. ఆ తండ్రి మార్గంలో తన అభివృద్ధిని సాధించాలని గర్వ పడతాడు.వారు వారి పిల్లలకు గొప్ప తండ్రులుగా ఉంటారు. అంతేకాకుండా, వారు తమ జీవితంలో ప్రతిదీ సజావుగా, న్యాయంగా ఉంచడానికి ఇష్టపడతారు. వారు అహంభావానికి విరుద్ధంగా ఉంటారు. ప్రజలు వారిని ఏమనుకుంటున్నారో అనేది పట్టించుకోరు. వారి ఈ మనస్తత్వమే ఇంటిని స్వర్గంగా మార్చేస్తుంది. అయితే, మతిమీరిన మంచితనం కూడా పనికిరాదన్నది గుర్తు పెట్టుకోవాలి. 


12) మీన లగ్నం: ఎదుటి వ్యక్తి దోషాలను గుర్తించే వాడుగా ఉంటాడు వీరి తండ్రి. ఆ కారణంగా పిల్లల తప్పులను గ్రహించుట వలన వారిని మార్గంలో పెట్టడానికి దండించే అవకాశం ఉంది. పిల్లలు ఆరంభంలో కష్టం అనిపించినా తర్వాతి కాలంలో అభిమానించే అవకాశాలెక్కువ. నాన్నలు చాలా గంభీరంగా ఉంటారు, దృఢంగా ఉంటారు. వారు పిల్లలతో ఆడటానికి ఇష్టపడరు. అయితే, పిల్లలతో దయగా ఉంటారు. ఒక ఆసక్తికరమైన వ్యక్తిగా, పిల్లల గురించి ప్రతిదీ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. పిల్లలకి కొత్త విషయాలు ఏకగ్రత క్రమశిక్షణ ఉండాలని కోరుకుంటారు. సరియైన మార్గములోకి వెళ్లి తమ పేరు నిలబెట్టాలని ఒక ఆశ లోపల నిరంతరము. కొందరు తండ్రులు తమ పిల్లలు ఏ రంగము ఎంచుకున్న దాని గురించి బాగా తెలుసుకొని పిల్లల ఇష్టము ఆసక్తి బట్టి మౌనముగా అయిన ప్రోత్చాహమిస్తారు.ఈ లగ్నములో పిల్లలకు మాత్రము తండ్రి పై చాల భయభక్తులు గౌరవము ఉంటాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa