ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు

national |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 09:16 PM

రాహుల్ గాంధీ బావ, ప్రియాంక భర్త అయిన రాబర్ట్ వాద్రాకు మనీలాండరింగ్‌ కేసులో రేపు విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ. యూకేకు చెందిన ఆయుధాల కన్సల్టెంట్ సంజయ్ భండారీకి సంబంధించిన కేసులో రాబర్ట్ వాద్రా వాగ్మూలాన్ని రికార్డ్ చేయడానికే ఈ సమన్లు జారీ చేసినట్లు సోమవారం అధికారిక వర్గాలు తెలిపాయి.సంజయ్​ భండారీ అక్రమ నగదు చలామణి (మనీ లాండరింగ్) కేసులో తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి జూన్​ 17న ఈడీ ముందు రాబర్ట్ వాద్రా హాజరు కావాలని కోరినట్లు సదరు అధికారిక వర్గాలు తెలిపాయి.వాస్తవానికి జూన్​ 10నే రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ 56 ఏళ్ల వాద్రా తనకు జూన్​ 9న ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నాయని, ప్రోటోకాల్ ప్రకారం కొవిడ్ టెస్ట్ చేయించుకున్నానని చెప్పి, గైర్హాజరు అయ్యారు.అయితే వాద్రాకు ఈడీ సమన్లు తప్పించుకునే ఉద్దేశం లేదని, ఈ నెల చివర్లో తన విదేశీ ప్రయాణానికి ముందుగానీ లేదా తరువాత ఎప్పుడైనా కానీ ఈడీ ముందు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది అప్పట్లో చెప్పారు.అయితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్​ (పీఎంఎల్​ఏ) కింద తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి, తరువాత ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి రాబర్ట్ వాద్రాకు ఈడీ తాజా సమన్లు​ జారీ చేసినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa