కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 5,608 కొవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జనవరి 1 నుంచి ఇప్పటివరకు 120 మంది ప్రాణాలు కోల్పోగా.. 24 గంటల్లో 4 కొవిడ్ మరణాలు సంభవించాయి. కేరళలో కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండగా, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఏపీలో 44, తెలంగాణాలో 9 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇన్‌ఫెక్షన్ తీవ్రత తక్కువగానే ఉందని అధికారులు తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa