ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్ జనరల్స్‌ను వణికించిన ఇజ్రాయెల్ కోవర్ట్స్

international |  Suryaa Desk  | Published : Tue, Jun 24, 2025, 08:46 PM

ఇరాన్‌ న్యూక్లియర్ స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులు చేసే క్రమంలో ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని తెలుస్తోంది. జూన్ 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేయగా.. ఇందులో టాప్ ఇరాన్ మిలిటరీ లీడర్లు, అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే మరికొంతమంది ఇరాన్ టాప్ కమాండర్లను ఇజ్రాయెల్ కోవర్టులు బెదిరించారని తెలుస్తోంది. వారికి టైమ్ ఇచ్చి మరీ పారిపొమ్మన్నట్లు సమాచారం. తాము చెప్పింది చేయకుండా.. తమ దాడిలో చనిపోయిన వారి గతే పడతుందని ఇజ్రాయెల్ కోవర్టలు బెదిరించినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించిది.


ఆ కథన ప్రకారం.. ఇజ్రాయెల్ గూఢచారులు ఇరాన్ అధికారులకు ఫోన్లు చేసి బెదిరించారు. దాదాపు 20 మంది టాప్ మిలిటరీ అధికారులకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. దీనికి సంబంధించి వాషింగ్టన్ పోస్ట్ ఒక ఆడియో రికార్డింగ్, ట్రాన్స్క్రిప్ట్‌ను సేకరించినట్లు తెలుస్తోంది. అందులో ఒక ఇజ్రాయెల్ కోవర్ట్, ఇరాన్ జనరల్‌తో మాట్లాడిన మాటలు ఉన్నాయి. అందులోని ఓ ఆ సంభాషణ ఇది.


ఇజ్రాయెల్ కోవర్ట్: "హలో, కమాండర్."


ఇరాన్ జనరల్: "హలో?"


ఇజ్రాయెల్ కోవర్ట్: "సలాం అలైకుమ్"


ఇరాన్ జనరల్: "హలో?"


ఇజ్రాయెల్ కోవర్ట్: "మీకు వినిపిస్తుందా?" "నేను మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. రెండు గంటల క్రితం బాగేరి, సలామి, షంఖానిలను నరకానికి పంపిన దేశం నుంచి నేను కాల్ చేస్తున్నాను." "నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను. మీరు మీ భార్య, పిల్లలతో కలిసి తప్పించుకోవడానికి మీకు 12 గంటలు సమయం ఉంది. లేకపోతే, మా జాబితాలో నెక్స్ట్ ఉంది మీరే. మీ మెడ నరం కంటే మేమే మీకు దగ్గరగా ఉన్నాము. ఇది గుర్తుంచుకోండి. దేవుడు మిమ్మల్ని రక్షించుగాక."


ఇరాన్ జనరల్: "సరే, మీరు ఏం చెప్పలేదు."


ఇజ్రాయెల్ కోవర్ట్: "నేను మీకు చెప్పాను, సోదరా, నేను ఇప్పుడే స్పష్టంగా వివరించాను."


ఇరాన్ జనరల్: "మీరు ఏం చెప్పారు?"


ఇజ్రాయెల్ కోవర్ట్: "నేను మీకు గడువు ఇచ్చాను."


ఇరాన్ జనరల్: "నేను ఏమి చేయాలి?"


ఇజ్రాయెల్ కోవర్ట్: " "మేము ఈ ప్రభుత్వం నుంచి వైదొలిగాము, 46 సంవత్సరాలుగా మన దేశాన్ని నాశనం చేసిన ప్రజల కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి మేము సిద్ధంగా లేము. వారు మమ్మల్ని చంపారు, దొంగిలించారు, మా నుంచి లాక్కున్నారు, ఈ దేశంలోని పిల్లలను ముక్కలు చేశారు." అని చెబుతూ మీరు 12 గంటల్లో ఒక వీడియో చేయాలి."


ఇరాన్ జనరల్: "నేను మీకు (ఆ వీడియో) ఎలా పంపాలి?"


ఇజ్రాయెల్ కోవర్ట్: "నేను మీకు ఒక టెలిగ్రామ్ ID పంపుతాను. దాని ద్వారా పంపండి."


ఇరాన్ జనరల్: "చెప్పండి, చెప్పిండి"


ఇజ్రాయెల్ కోవర్ట్: "నేను మీకు పంపుతాను. నేను ఇప్పుడే SMS చేస్తాను."


ఇరాన్ జనరల్: "మీరు ఎక్కడ SMS చేస్తారు?"


ఇజ్రాయెల్ కోవర్ట్: "మా దగ్గర మీ నంబర్ ఉంది. చూడండి, మీ గురించి అన్నీ మాకు తెలుసు. మీకు అర్థం కాలేదని అనిపిస్తుంది. మీరు ఎక్కడ ఉన్నారో కూడా మీకు అర్థం కావడం లేదు. నేను మీకు చెప్తున్నా, మేము మీ నాయకులందరినీ మట్టుబెట్టాము. వారంతా గాలిలో కలిసిపోయారు. మేము వారిని పౌడర్‌లా మార్చాము. నీ భార్య, పిల్లలను రక్షించడానికి నేను మీకు ఒక ప్రతిపాదన ఇవ్వడానికి కాల్ చేస్తుంటే.. నువ్వేంటి అయోమయంలో ఉన్నావా?"


ఇరాన్ జనరల్: "సరే, నేను మీకు ఎలా పంపాలని అడుగుతున్నాను?"


ఇజ్రాయెల్ కోవర్ట్: "నేను మీకు పంపుతానని చెబుతున్నాను."


ఈ సంభాషణ జరిపిన ఇరాన్ జనరల్ వీడియో తీసి పంపాడో లేదో తెలియదు. కానీ అతడు ఇంకా ఇరాన్‌లోనే ఉన్నాడని ఒకరు చెప్పారని వార్తా సంస్థ పేర్కొంది. ఈ ఫోన్ కాల్స్‌పై ఇజ్రాయెల్ స్పందించలేదు. కానీ, కొందరు ఇజ్రాయెల్ అధికారులు మాత్రం.. ఇది "రైజింగ్ లయన్" అనే కోవర్ట్ మిషన్‌లో భాగమని చెప్పారు.


ఈ ఫోన్ కాల్స్ ద్వారా ఇరాన్ సైన్యాన్ని భయపెట్టాలని ఇజ్రాయెల్ చూసిందని తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన వారి స్థానంలోకి వచ్చే అధికారులను కూడా భయపెట్టాలని ఇజ్రాయెల్ అనుకున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ బెదిరింపుల్లో భాగంగా ఇంటి డోర్ల కింద ఉత్తరాలు పెట్టడం, ఫోన్లు చేయడం, వారి భార్యల ద్వారా సందేశాలు పంపడం వంటివి చేశారు ఇజ్రాయెల్ కోవర్టులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa