ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తరచూ పెదాలు పగులుతున్నాయా,,,,ఓ పదార్థం అప్లై చేస్తే మళ్లీ సమస్య రానే రాదు

Life style |  Suryaa Desk  | Published : Tue, Jun 24, 2025, 11:56 PM

కొంత మందికి పెదాలు చాలా త్వరగా ఎండిపోతాయి. ఎన్ని క్రీమ్స్ రాసినా, మాయిశ్చరైజర్ వాడినా సరే. కాసేపటి వరకూ తేమ ఉన్నట్టు అనిపించినా మళ్లీ యథావిధిగా డ్రై అయిపోతాయి. పగిలిపోయి చాలా బిగుతుగా మారిపోతాయి. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే..పెదవులపై చర్మం చాలా పల్చగా ఉంటుంది. మిగతా చర్మంపై ఉన్నట్టు ఇక్కడ నేచురల్ ఆయిల్స్ కూడా ఉండవు. అందుకే చాలా త్వరగా ఎండిపోతుంటాయి. పెదాలు పగిలిపోయినప్పుడు రక్తం వచ్చి నొప్పి ఇబ్బంది పెడుతుంది. అయితే..పెదాలు పొడిబారినప్పుడు నెయ్యి రాస్తే చాలా తేమ చేరుకుంటుందని, ఎలాంటి సమస్య రాదని చెబుతున్నారు బ్యూటీ ఎక్స్ పర్ట్ రుచితా గాగ్. ఇంకే క్రీమ్స్ రాయాల్సిన పని లేదని, కేవలం ఓ నెయ్యితోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వివరించారు. నెయ్యి రాయడం వల్ల ఈ సమస్య ఎలా తీరుతుందో తెలుసుకుందాం.


నెయ్యి..ఓ మాయిశ్చరైజర్


పొడిబారిన పెదాలకు నెయ్యి అప్లై చేయడం వల్ల కలిగే మొదటి ప్రయోజనం అంటంటే..అదో నేచురల్ మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి తేమను పట్టి ఉంచడంలో తోడ్పడతాయి. అంటే..నెయ్యి రాసుకున్నప్పుడు ఆ తేమ ఎక్కువ సమయం పాటు పెదాలపై ఉండేలా ఈ ఫ్యాటీ యాసిడ్స్ సహకరిస్తాయి. ఫలితంగా పెదాలు త్వరగా పొడిబారకుండా ఉంటాయి. నెయ్యి చాలా త్వరగా చర్మంలోకి చొచ్చుకుపోతుంది. సాధారణంగా చర్మం డీహైడ్రేట్ అయినప్పుడే ఇలా పొడిబారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే నెయ్యిలో ఉన్న తేమ చర్మ కణాల్లోకి చొచ్చుకుపోతుందో అప్పుడు స్కిన్ హైడ్రేట్ అవుతుంది. పైగా సాఫ్ట్ గా మారిపోతుంది. తద్వారా పొడిబారడం తగ్గుతుంది.


యాంటీ ఆక్సిడెంట్స్


నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంటే..చర్మంలో ఉన్న మురికిని క్లీన్ చేయడంలో ఇవి తోడ్పడతాయి. అంతే కాదు. నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పగుళ్లను చాలా త్వరగా నయం చేస్తాయి. మరో విషయం ఏంటంటే..పెదాలు పొడిబారినప్పుడు చాలా ఇరిటేషన్ వస్తుంది. తరచూ దురద వస్తుంది. దీని వల్ల బాగా గట్టిగా రుద్దుతుంటారు. దీని వల్ల సమస్య ఇంకా పెద్దదవుతుందే తప్ప తగ్గదు. ఈ ఇరిటేషన్ తగ్గిపోవాలంటే తప్పనిసరిగా నెయ్యి రాయాలి. ఇది చాలా త్వరగా ఈ ఇబ్బందిని తగ్గించేస్తుంది. నేచురల్ హీలర్ గా పని చేస్తుంది.


ఎన్నో లాభాలు


నేచురల్ మెడిసిన్


నెయ్యి అనేది పాల ఉత్పత్తి. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. డ్రై లిప్స్ కోసం వాడే రకరకాల క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, లిప్ బామ్స్ లో కెమికల్స్ ఉంటాయి. అయితే..పెదాలపై వీటిని రాసుకున్నప్పుడు తెలియకుండానే ఆ కెమికల్స్ లోపలికి వెళ్లిపోతాయి. తినేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు అనుకోకుండానే ఇలా జరుగుతుంది. దీని వల్ల లేనిపోని కొత్త సమస్యలు వస్తాయి. అలా కాకుండా చాలా నేచురల్ గా ఉండాలంటే మాత్రం నెయ్యి వాడాలి. ఇందులో రసాయనాలు ఏమీ ఉండవు. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్లకి నెయ్యి చాలా బాగా పని చేస్తుంది. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉండదు.


శాశ్వత పరిష్కారం


పెదాలు పొడిబారిపోవడం అనేది తరచూ వచ్చే సమస్య. అందుకే దీనికి శాశ్వత పరిష్కారం చూసుకోవాలి. అందుకు ఒకే ఒక మార్గం నెయ్యి వాడడం. తేమని పట్టి ఉంచడంతో పాటు వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా పెదాలను కాపాడతాయి. ఎంత ఎండగా ఉన్నా సరే పెదాలు పొడిబారకుండా ఉండాలంటే నెయ్యి రాసుకోవాలని ఎక్స్ పర్ట్ రుచితా గాగ్ సూచిస్తున్నారు. అంతే కాదు. పెదాలు ఎప్పుడూ నల్లగా మారకుండా మెరిసిపోయేలా చేయడంలోనూ నెయ్యి చాలా బాగా పని చేస్తుంది. పింక్ కలర్ లో చాలా సాఫ్ట్ గా కనిపించేలా చూస్తుంది. మొత్తంగా పెదాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.


విటమిన్స్


పెదాలకు సరైన విధంగా న్యూట్రియెంట్స్ అందకపోయినా ఇలాగే తరచూ పొడిబారిపోతూ ఉంటాయి. నెయ్యిలో ఉండే పోషకాలు ఇలా పొడిబారిపోయి పగిలిపోయిన పెదాలను బాగు చేస్తాయి. చాలా త్వరగా ఈ సమస్య తగ్గేలా చూస్తాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..నెయ్యి వల్ల పెదాలు ఎప్పుడూ హెల్తీగా ఉండడమే కాకుండా వృద్ధాప్య ఛాయలు కూడా తగ్గిపోతాయి. ఇందులో విటమిన్ ఎ, డి, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం రీయాక్టివ్ అయ్యేందుకు సహకరిస్తాయి. డెడ్ సెల్స్ తొలగిపోతాయి. అయితే..నెయ్యిని పెదాలకు రాసే ముందు కచ్చితంగా ఓ సారి నీళ్లతో క్లీన్ చేసుకుని తుడవాలి. అప్పుడు నెయ్యి అప్లై చేయాలి. నిద్రపోయే ముందు రాసుకుంటే ఎక్కువగా తేమ అందేందుకు వీలుంటుంది. రోజుకి రెండు మూడు సార్లు ఇలా అప్లై చేస్తే చాలా త్వరగా సమస్య తగ్గిపోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa