భీమ్ ఆర్మీ చీఫ్, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ జాతీయ మహిళా కమిషన్‌కు తాజాగా ఫిర్యాదు చేసింది. ‘మూడేళ్లుగా ఆజాద్‌తో రిలేషన్‌లో ఉన్నాను. తనకు పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి పలుమార్లు నాతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు’ అని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఎంపీపై NCW కేసు నమోదు చేసింది. కాగా తాను న్యాయ పోరాటం చేస్తున్నానని, నిజం బయటపడుతుందని ఆజాద్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa