రాష్ట్రంలోని 7 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలకుగాను, 5 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలకు మెయిన్ అంగన్వాడీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు విడుదలవుతాయని తెలిపారు. మినీ అంగన్వాడీల్లో ఇప్పటి వరకు ఒక్క కార్యకర్తలు మాత్రమే పనిచేసే వారని, ఆయాలు ఉండేవారు కాదని తెలిపారు. మినీకి మెయిన్ అంగన్వాడీ హోదా కల్పించి న తర్వాత, ఆ 5వేల మందికి పూర్తిస్థాయి అంగన్వాడీ టీచర్ హోదా ఇస్తూ చట్టబద్ధమైన వేతనాలు, విధులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ కేంద్రాల్లో అంగన్వాడీ 5 వేల మంది ఆయాల నియామకానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa