ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే అన్ని సేవలకు ఒకే రైల్ వన్ యాప్

national |  Suryaa Desk  | Published : Tue, Jul 01, 2025, 08:56 PM

భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం RailOne పేరుతో ఒక కొత్త సూపర్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా రైల్వే సంబంధిత విచారణలు, టికెట్ బుకింగ్, పీఎన్ఆర్ స్టేటస్ ట్రాకింగ్, రైలు రియల్ టైమ్ లొకేషన్ తెలుసుకోవడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, ఫిర్యాదులు చేయడం వంటి అనేక సేవలను ఒకే యాప్‌లో అందిస్తోంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ RailOne యాప్ రైల్వే సేవలను ఒకే చోటుకు చేర్చడం ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుందని రైల్వే శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


ఈ రైల్ వన్ యాప్ ముఖ్య ఉద్దేశ్యం సులభమైన, స్పష్టమైన ఇంటర్‌ఫేస్‌తో రైల్వే ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని అందించడమని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే రైలు ప్రయాణికులు.. ఇప్పటికే ఉన్న RailConnect లేదా UTSonMobile వివరాలతో ఈ యాప్‌లో లాగిన్ కావచ్చని తెలిపింది. దీని ద్వారా వేర్వేరు పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది.


ప్రస్తుతం, రైల్వే ప్రయాణికులు వివిధ సేవల కోసం వేర్వేరు యాప్‌లు, వెబ్‌సైట్‌లను ఉపయోగిస్తున్నారు. టికెట్ బుకింగ్‌ల కోసం IRCTC Rail Connect.. రైలులో భోజనం ఆర్డర్‌ చేసుకోవడానికి IRCTC eCatering Food on Track.. ఫిర్యాదుల కోసం Rail Madad, రిజర్వ్ చేయని టిక్కెట్ల కోసం UTS, రైలు స్థితిని తెలుసుకోవడానికి నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ఉపయోగిస్తున్నారు.


IRCTC Rail Connect యాప్ రిజర్వ్‌డ్ టిక్కెట్ల బుకింగ్‌ల కోసం ప్రత్యేక హక్కులను కలిగి ఉంది. ఇప్పటికే ఈ యాప్ 100 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటేసి.. రైల్వేల్లో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌గా నిలిచింది. కొత్తగా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకునే ప్రయాణికులు సులభంగా ఇందులో నమోదు చేసుకోవచ్చు. విచారణల కోసం, మొబైల్ నంబర్ ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా గెస్ట్‌గా కూడా యాప్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.


ఈ RailOne యాప్‌లో R-Wallet (Railway e-wallet) సౌకర్యం కూడా ఉంటుంది. యూజర్లు mPIN, బయోమెట్రిక్ ద్వారా తమ అకౌంట్లలోకి లాగిన్ కావచ్చని తెలుస్తోంది. ఒకే యాప్‌లో అన్ని ప్రయాణికుల సేవలను ఇది అందిస్తుంది. IRCTC రిజర్వ్‌డ్, అన్‌ రిజర్వ్‌డ్, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను బుక్ చేసుకోవడం, పీఎన్ఆర్, రైలు ఎక్కడ ఉందో ట్రాక్ చేయడం, కోచ్ పొజిషన్, రైల్ మదద్, ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడమని సంబంధిత వర్గాలు తెలిపాయి.


IRCTC యాప్‌లో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. రైల్వే టిక్కెట్ల బుకింగ్ కోసం IRCTC యాప్ ప్రధాన వేదిక అయినప్పటికీ.. ఇటీవల చాలాసార్లు అందులో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. దీంతో రైల్వే ప్రయాణికులు సోషల్ మీడియాలో అసహనంవ్యక్తం చేశారు.


ఈ యాప్ ద్వారా టికెట్ రిజర్వేషన్, అన్‌రిజర్వ్డ్ టికెట్ బుకింగ్, ప్లాట్‌ఫారమ్ టికెట్ బుకింగ్, నెలవారీ పాస్ తీసుకోవడం వంటివి చేయవచ్చు. రైలు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వేరే థర్డ్ పార్టీ యాప్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండాలొకేషన్‌ను కూడా ట్రాక్ చేయవచ్చు. పీఎన్ఆర్ స్టేటస్ కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రయాణికుల కోసం ఆహారం ఆర్డర్ చేసే సదుపాయం కూడా ఉంది. ఫిర్యాదుల కోసం రైల్ మదద్ అనే ఫీచర్ కూడా ఉంది. వీడియో, ఆడియో, ఫోటోల ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. రిఫండ్ కోసం కూడా రిక్వెస్ట్ కూడా పెట్టుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa