ప్రకాశం జిల్లా దొనకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టిన ఘటనలో ఓ బాలిక గాయపడింది. బ్రాహ్మరావుపేటకు చెందిన నర్సిరిన్ అనే బాలిక రెండో తరగతి చదువుతుంది. అయితే గురువారం మధ్యాహ్నం అంగడిలో కొనుక్కోవడానికి స్కూలు నుంచి బయటకు వచ్చింది. అయితే ఈ సమయంలోనే అటుగా వస్తున్న కారును బాలికను ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలికకు గాయాలు కాగా.. స్థానికులు వెంటనే బాలికను చికిత్స నిమిత్తం వినుకొండ ఆస్పత్రికి తరలించారు. అయితే స్వల్ప గాయాలు కావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa